[svt-event title=”రాజస్థాన్ రాయల్స్‌పై 46పరుగుల తేడాతో Delhi Capitals ఘన విజయం” date=”09/10/2020,11:18PM” class=”svt-cd-green” ] ఢిల్లీతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 138పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో Delhi Capitals 46పరుగులతో ఘన విజయం సాధించింది. [/svt-event]
[svt-event title=”8వ వికెట్‌గా శ్రీయాస్ గోపాల్” date=”09/10/2020,11:03PM” class=”svt-cd-green” ] ఎనిమిదవ వికెట్‌గా శ్రీయాస్ గోపాల్ అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. [/svt-event]
[svt-event title=”ఆర్చర్ అవుట్.. ఓటమికి చేరువైన రాజస్థాన్.. స్కోరు 104/7″ date=”09/10/2020,10:48PM” class=”svt-cd-green” ] ఢిల్లీతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా అయ్యింది. ఆర్చర్ వికెట్ 7వ వికెట్‌గా కోల్పోయింది రాజస్థాన్.. [/svt-event]
[svt-event title=”ఆరు వికెట్లు అవుట్.. రాజస్థాన్ స్కోరు 90/6″ date=”09/10/2020,10:37PM” class=”svt-cd-green” ] ఫస్ట్ వికెట్‌గా రెండు ఫోర్లు సాయంతో 8బంతుల్లో 13పరుగులు చేసిన జోస్ బట్లర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండవ వికెట్‌గా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 17బంతుల్లో 24పరుగులు చేసి అన్రిచ్ నార్ట్జే బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మియర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత మూడవ వికెట్‌గా 9బంతుల్లో 5పరుగులు చేసిన సంజు శాంసన్ మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మియర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాల్గవ వికెట్‌గా ఒక్క పరుగు మాత్రమే చేసిన మహిపాల్ లోమోర్ అక్సర్ పటేల్‌కు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐదవ వికెట్‌గా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 36బంతుల్లో 34పరుగులు తీసిన తర్వాత మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆరవ వికెట్‌గా ఆండ్రూ టై అక్సర్ బౌలింగ్‌లో కగిసో రబడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ప్రస్తుతం 13.5ఓవర్లు ముగిసేసరికి 6వికెట్లు నష్టానికి రాజస్థాన్ 90పరుగులు చేసింది. [/svt-event]
[svt-event title=”ఆఖర్లో మెరుపులు.. ఢిల్లీ స్కోరు 184/8.. రాజస్థాన్ టార్గెట్ 185″ date=”09/10/2020,9:21PM” class=”svt-cd-green” ] ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్సర్ పటేల్ ఆఖర్లో మెరుపులు మెరిపించగా ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చెయ్యగలిగింది. [/svt-event]
[svt-event title=”హెట్మేయర్ అవుట్.. ఢిల్లీ స్కోరు 159/6(18.0)” date=”09/10/2020,9:04PM” class=”svt-cd-green” ] ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని ఆదుకుంటున్నట్లుగా కనిపించిన హెట్మేయర్ ఆరవ వికెట్‌గా అవుట్ అయ్యాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో రాహుల్ తివాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18ఓవర్లకు ఢిల్లీ స్కోరు 159పరుగులు చేశారు. [/svt-event]
[svt-event title=”ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. స్కోరు 111/5(14.0)” date=”09/10/2020,8:42PM” class=”svt-cd-green” ] రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన ధావన్ అవుట్ అవగా.., పృద్వీ షా కూడా అవుట్ అయ్యాడు. అనంతరం శ్రీయాస్ అయ్యర్, పంత్ రనౌట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నారు. ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నట్లుగా అనిపించిన స్టాయిన్స్ కూడా తివాటియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హెట్మేయర్, హర్షల్ పటేల్ ఉన్నారు. స్కోరు 111/5(14.0) [/svt-event]
[svt-event title=”పవర్ ప్లే లో మూడు వికెట్లు.. ఢిల్లీ స్కోరు 51/3″ date=”09/10/2020,8:01PM” class=”svt-cd-green” ] ఓపెనర్‌గా వచ్చిన ధావన్ అవుట్ అవగా.., పృద్వీ షా కూడా అవుట్ అయ్యాడు. అనంతరం శ్రీయాస్ అయ్యర్ పరుగులు రాబట్టే బాధ్యతను తీసుకోగా.. శ్రీయాస్ అయ్యర్ కూడా రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడినట్లుగా అయ్యింది. ఢిల్లీ స్కోరు 50/3(6.0) [/svt-event]
[svt-event title=”మూడవ ఓవర్‌లో 18పరుగులు.. ఢిల్లీ స్కోరు 31/1″ date=”09/10/2020,7:49PM” class=”svt-cd-green” ] ఓపెనర్‌గా వచ్చిన ధావన్ అవుట్ అవగా.., పృద్వీ షా, శ్రీయాస్ అయ్యర్ పరుగులు రాబట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ అరోన్ బౌలింగ్‌లో చితక్కొట్టారు. మూడవ ఓవర్‌లోనే 18పరుగులు సాధించారు. ఢిల్లీ స్కోరు 31/1(3.0) [/svt-event]
[svt-event title=”ధావన్ అవుట్.. ఢిల్లీ స్కోరు 12/1″ date=”09/10/2020,7:41PM” class=”svt-cd-green” ] ఓపెనర్లుగా ధావన్, పృద్వీ షా బరిలోకి దిగగా.. ఫస్ట్‌లోనే ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ వికెట్‌గా ధావన్ అవుట్ అయ్యాడు. ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఢిల్లీ స్కోరు 13/1(2.0) [/svt-event]
[svt-event title=”ఓపెనర్లుగా దావన్, పృధ్వీ షా..: స్కోరు 7/0″ date=”09/10/2020,7:33PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లుగా దావన్, పృధ్వీ షా బరిలోకి దిగారు. ఫస్ట్ ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 7పరుగులు సాధించారు. [/svt-event]
[svt-event title=” షార్జాలో రాజస్థాన్ రికార్డు:” date=”09/10/2020,7:25PM” class=”svt-cd-green” ] ఈ ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ఏడవ స్థానంలో ఉన్నప్పటికీ, షార్జా మైదానంలో వారి రికార్డు మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలవగా.. రెండు మ్యాచ్‌లు షార్జా మైదానంలోనే.. అటువంటి పరిస్థితిలో, రాజస్థాన్ రాయల్స్ ఈ మైదానంలో తమ రికార్డును కొనసాగించే అవకాశం ఉంది. రాజస్థాన్ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఈ మ్యాచ్ మాత్రం కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది. [/svt-event]
[svt-event title=”పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం: ” date=”09/10/2020,7:25PM” class=”svt-cd-green” ] పాయింట్ల పట్టికలో 4 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ఢిల్లీ కంటే ఎక్కువగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే, అది 10 పాయింట్లు పొందుతుంది. పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది. [/svt-event]
[svt-event title=”పరుగుల వర్షం ఖాయమేనా?” date=”09/10/2020,7:24PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ మరి కాసేపట్లో రాత్రి 7:30 గంటలకు షార్జా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ ఈ సీజన్‌లో అద్భుతంగా ప్రదర్శన ఇస్తుండగా.. 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. రాజస్థాన్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలవగా.. వరుసగా గత 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ చిన్నది కాగా.. రెండు జట్లలో సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. [/svt-event]
[svt-event title=”రెండు జట్లు(Playing XI):” date=”09/10/2020,7:22PM” class=”svt-cd-green” ]
A look at the Playing XI for #RRvDC #Dream11IPL pic.twitter.com/0SpGbfOmho
— IndianPremierLeague (@IPL) October 9, 2020
[svt-event title=”Rajasthan Royals Playing XI:” date=”09/10/2020,7:19PM” class=”svt-cd-green” ] యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (డబ్ల్యూ), స్టీవెన్ స్మిత్ (సి), సంజు సామ్సన్, మహిపాల్ లోమోర్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టై, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, వరుణ్ ఆరోన్ [/svt-event]
[svt-event title=”Delhi Capitals Playing XI:” date=”09/10/2020,7:18PM” class=”svt-cd-green” ] పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (సి), రిషబ్ పంత్ (డబ్ల్యూ), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే [/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్:” date=”09/10/2020,7:14PM” class=”svt-cd-green” ] రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. [/svt-event]