IPL 2020: ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే పంజాబ్ గెలవాల్సిందే.. స్టార్ ప్లేయర్ రిటర్న్ ఫిక్స్!

  • Publish Date - October 10, 2020 / 12:50 PM IST

IPL 2020, KKR vs KXIP: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో, శనివారం(10 అక్టోబర్ 2020) డబుల్ హెడర్ జరగబోతుంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు జరిగే మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో పంజాబ్ గెలవలేకపోతే, జట్టు ప్లే-ఆఫ్‌కు చేరే అవకాశాలు పూర్తిగా కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితిలో క్రిస్ గేల్ పంజాబ్ జట్టుకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.



కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లు ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో టీమ్ కోచ్ అనిల్ కుంబ్లే క్రిస్ గేల్ ఆడకపోవడానికి కారణం చెప్పాడు. క్రిస్ గేల్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఎంపిక కావడం ఖాయం అని కుంబ్లే అన్నాడు, అయితే మ్యాచ్‌కు ముందు అతను ఫిట్ గా లేడు.



ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో క్రిస్ గేల్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇంకా రాలేదు. గేల్ ఫిట్‌గా లేకపోవడమే అందుకు కారణం. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకోగా.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రిస్ గేల్ జట్టుసకు కచ్చితంగా అవసరం. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో క్రిస్ గేల్ ఆడే అవకాశం కనిపిస్తుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాక్స్‌‍వెల్ స్థానంలో క్రిస్ గేల్.. ప్లేయింగ్ పదకొండులో ఉండవచ్చు. ఈ సీజన్‌లో మాక్స్‌‍వెల్ కూడా ఇప్పటికి కూడా అద్భుతంగా ఆడిన సంధర్భాలు లేవు. అయితే, క్రిస్ గేల్ రాకతో.. మ్యాక్స్‌వెల్ దూరమైతే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కొద్దిగా బలహీనంగా మారుతుందని భావిస్తున్నారు.



పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరి స్థానంలో ఉండగా.. కెకెఆర్‌పై జట్టు గెలవకపోతే, ప్లే-ఆఫ్‌కు పంజాబ్ చేరే అవకాశాలు కష్టంగా మారిపోతాయి.



Probable XIs:
Kings XI Punjab: కేఎల్ రాహుల్(C), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్ (wk), మన్‌దీప్ సింగ్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్ష్‌దీప్ సింగ్.