IPL 2020, RCB vs CSK: టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నై బౌలింగ్..

  • Publish Date - October 25, 2020 / 03:11 PM IST

IPL 2020, RCB vs CSK Match 44 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020) 13 వ సీజన్‌లో 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ రోజు(25 అక్టోబర్ 2020) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న చెన్నై వరుస విజయాలతో ఈ సిరీస్‌లో అధ్భుత ప్రదర్శన ఇస్తూ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.



ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఇక ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో, ఐపిఎల్‌లో అత్యల్ప స్కోరు సాధించిన చెత్త రికార్డును చెన్నై మూట కట్టుకుంది. ప్రస్తుతం బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, మూడు పరాజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. 16 పాయింట్లతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ సీజన్ కోహ్లీ జట్టు అద్భుతంగా ఆడుతుంది.



ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుని చెన్నై జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్ విశ్వ రూపం చూపగా. నవదీప్ సైని, మారిస్, ఇసురు ఉడానా అద్భుతాలు చేశారు. అదే సమయంలో స్పిన్లో, యుజ్వేంద్ర చాహల్ మరియు సుందర్ జట్టుకు బలంగా ఉన్నారు. బ్యాటింగ్ కూడా బెంగళూరు జట్టుకు బలంగా ఉంది.



Royal Challengers Bangalore (Playing XI): దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, గుర్కీరత్ సింగ్ మన్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.



Chennai Super Kings (Playing XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్