ఐపీఎల్‌కు కరోనా ఎఫెక్ట్ పడింది.. ఈ ఏడాది ఐఎపీఎల్‌ను రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..IPL పదమూడో సీజన్ అనుకున్న ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదేపదే స్పష్టం చేస్తున్నారు. మార్చి 29వ తేదీన ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సీజన్ ఆరంభ మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. అభిమానులను స్టేడియాలకు రాకుండా చేసి..టీవీల్లోనే మ్యాచ్ చూసే వీలు కల్పించే విషయంపై చర్చ నడుస్తోంది. దీనిపై మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్‌ను వాయిదా వేయడమో..లేదా మ్యాచ్‌లను టీవీల్లో మ్యాచ్‌లను టీవీల్లో చూసేలా అభిమానులను పరిమితం చేయడమో చేయాలన్నారు.
2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ఐపీఎల్‌పై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కరోనా విస్తరిస్తుండడంతో ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలను వద్దంటోంది. ఇక ఇప్పటికే వీసాలపై.. ఏప్రిల్ 15 ఆంక్షలను కేంద్రం విధించింది.. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లకు వీసాలు కూడా రాని పరిస్థితి ఉంది. దీంతో ఐపీఎల్ రద్దు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. లీగ్‌ను వాయిదా వేయాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపె బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.(కరోనా ఆందోళనకరమేనన్న జై శంకర్…ప్రయాణాలు వద్దని సూచన)
షెడ్యూలు ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా భారీ జన సమూహాలు ఏర్పడకుండా చూడాలని శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ టికెట్ల విక్రయాన్ని నిషేధించిందనే వార్తలు వస్తున్నాయి.
Read More : మెడికల్ సర్టిఫికేట్ కిరికిరి : ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ స్టూడెంట్స్