IPL 2021 Anthem: ఐపీఎల్ కొత్త సాంగ్ వచ్చేసింది.. వీడియో!

Ipl 2021 Anthem

IPL 2021 Anthem: ఏప్రిల్ 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపిఎల్ 14వ సీజన్ ప్రారంభమవుతుంది. ఐపిఎల్ 2021కి సంబంధించి లేటెస్ట్‌గా ఓ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘అప్నా మంత్రం ఆఫ్ ఇండియా’ పేరిట విడుదలైన ఈ పాట ఒక్క నిమిషం 30సెకన్లు పాటు ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పుడు బోర్డు ఐపిఎల్ గీతాన్ని విడుదల చేసింది. ‘ఇండియా’స్ అప్నా మంత్రం’ అనే ఈ పాటను లేటెస్ట్‌గా విడుదల చేయగా.. ఐపిఎల్ బోర్డు ఈ గీతాన్ని భారతదేశం ఆత్మగా అభివర్ణిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పాటను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. పాటను తిరస్కరించినట్లుగా చెబుతున్నారు.

యాభై రెండు రోజుల పాటు జరిగే ఐపీఎల్ టోర్నీలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. 6 సిటీలు టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రతి సీజన్ కోసం డిఫరెంట్ స్టైల్‌లో బీసీసీఐ సాంగ్ విడుదల చేస్తుండగా.. ఈ ఏడాది సీజన్‌కు సంబంధించి అఫీషియల్ సాంగ్‌ను ఇండియా సక్సెస్ మంత్రంగా అభివర్ణిస్తూ రూపొందించింది.

ఐపీఎల్ 2021 సాంగ్.. స్కూల్‌ పిల్లలతో మొదలెట్టి.. వృద్ధాప్యంలో ఉన్న వారిని భాగం చేసుకుంటూ.. విరాట్ కోహ్లీ (RCB), రోహిత్ శర్మ(MI)తో పాటు కేఎల్ రాహుల్ (KP), శుభమన్ గిల్ (KKR), రిషబ్ పంత్ (DC), సాహా (SRH), రియాన్ పరాగ్ (RR), కృష్ణప్ప గౌతమ్ (CSK)తో సహా అందరు ఆటగాళ్లను సాంగ్‌లో డ్యాన్స్ చేయించారు.

ఈసారి టోర్నీ.. చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ సిటీల్లో జరగనుండగా.. ఏ జట్టుకీ తన సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఫస్ట్ మ్యాచ్‌‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇది 14వ సీజన్. గతేడాది సెప్టెంబర్‌లో మ్యాచ్‌లు యూఏఈలో జరగగా.. ఇప్పుడు మ్యాచ్‌లు దేశంలోనే జరగబోతున్నాయి.