Ipl 2021 Kkr Vs Rcb Kolkata Target 139
IPL 2021 KKR Vs RCB : ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు రాణించారు. కోహ్లి గ్యాంగ్ ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేసింది.
Record Prices : వామ్మో.. సిలిండర్ ధర రూ.2వేల 657, కిలో పాలు రూ. 1,195.. భారీగా పెరిగిన ధరలు
ఆర్సీబీ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రమే రాణించాడు. 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. జట్టులో అదే హయ్యస్ట్ స్కోర్. ఓపెనర్ పడిక్కల్ 18 బంతుల్లో 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. ఫెర్గుసన్ రెండు వికెట్లు తీశాడు.
నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఓడిన జట్టు ఇంటికెళ్తుంది.