Ipl 2021
IPL 2021 : ఐపీఎల్ క్వాలిఫయర్-2లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. పిచ్ సహకరించకపోవడంతో బ్యాటర్లు పరుగులు చేయలేకపోరు. శిఖర్ ధవన్ (36), శ్రేయాస్ అయ్యర్ (30) మినహా జట్టులోని మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, లాకీ ఫెర్గుసన్ 1, శివం మావి 1 వికెట్ తీశారు. పృథ్వీ షా 18, మార్కస్ స్టొయినిస్ 18 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 6 పరుగులు చేసి లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ వెనుదిరిగాడు. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.