Ipl 2021 Rr Vs Rcb
IPL 2021 RR Vs RCB : ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
రాజస్తాన్ ఓపెనర్ ఎవిన్ లివిస్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 22 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. యజువేంద్ర చాహల్ 2, అహ్మద్ 2 వికెట్లు తీశారు.
ఆరు విజయాలతో కొనసాగుతున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, చివరి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది.