IPL 2021: చెన్నై అరుదైన రికార్డు.. 7 సార్లు.. 3సార్లు కేకేఆర్‌పైనే.. ఆల్ విక్టరీ!

ఐపీఎల్-2021 టోర్నీ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్‌పై చెన్నై విజయం సాధించి ఈ సీజన్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు నెలకొల్పింది.

CSK Record : ఐపీఎల్-2021 టోర్నీ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్‌పై చెన్నై విజయం సాధించి ఈ సీజన్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు నెలకొల్పింది. చెన్నై ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సీజన్‌లో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తమ భాగస్వామ్యంలో చెన్నై తరపున ఆడిన వీరిద్దరూ ఏడోసారి 50 పరుగులు జోడించారు. అందులోనూ 3 సార్లు కోల్ కతా జట్టుపైనే ఈ స్కోరు నమోదు చేయడం విశేషం.

అంతేకాదు.. సీఎస్‌కే ఓపెనర్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఆరు మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లుగా రుతురాజ్‌, డుప్లెసిస్‌ 756 పరుగులు జోడించారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌ హిస్టరీలో వీరిద్దరూ మూడో స్థానంలో నిలిచారు. కోహ్లి- డివిలియర్స్‌(RCB) ప్లేయర్లు… 2016 ఐపీఎల్‌ సీజన్‌లో 939 పరుగులతో మొదటి స్థానంలో నిలిచారు. డేవిడ్‌ వార్నర్‌- బెయిర్‌ స్టో జోడి(SRH) 2019 ఐపీఎల్‌ సీజన్‌లో 791 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు.
IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆ తర్వాత బౌలర్లు రాణించారు. దీంటో ఈ మ్యాచ్ లో సీఎస్కే ఘన విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ దంచికొట్టాడు. సిక్సుల వర్షం కురిపించాడు. 59 బంతుల్లో 86 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు, రాబిన్ ఊతప్ప 31 పరుగులు, మోయిన్ ఆలీ 37 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ తీశారు.
IPL 2021 చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇది నాలుగోసారి..

ట్రెండింగ్ వార్తలు