IPL 2021 : ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్న సిరాజ్‌, కోహ్లి

ఐపీఎల్ లీగ్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు.

Ipl 2021 Virat Kohli, Mohammed Siraj Set To Join Rcb In Uae

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మిగతా మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు. రెండోసారి ఆర్‌టి-పిసిఆర్ పరీక్షల్లో నెగటివ్ రావడంతో చార్టర్డ్ కమర్షియల్ విమానాల్లో వీరిద్దరూ యూఏఈకి బయలుదేరారు. ఐపీఎల్ ఆటగాళ్లు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి చేశాయి. భారత శిబిరంలో కోవిడ్ -19 వ్యాప్తి తరువాత ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదవ టెస్ట్ నిరవధికంగా వాయిదా పడింది.
IPL Ad Revenue : ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 నుంచి మిగిలిన ఐపిఎల్ కోసం ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఆటగాళ్లంతా క్లస్టర్‌లలో బయలుదేరారు. కొంతమంది ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదర్‌బాద్ వంటి ఫ్రాంచైజీలచే ఏర్పాటు చేసిన చార్టర్ ఫ్లైట్‌లో యూఏఈ చేరుకున్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు కమర్షియల్ ఫ్లైట్‌లో ప్రయాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా మాంచెస్టర్ నుంచి చార్టర్ ఫ్లైట్ లో యూఏఈ చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ అందరూ ఇప్పుడు రెండోసారి RT-PCR పరీక్షలు చేయించుకోగా నెగటివ్ నిర్ధారణ అయింది.


వీరిలో చాలామంది ఇప్పటికే ఐపిఎల్ కోసం దుబాయ్ బయల్దేరారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇద్దరు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, అర్జన్ నాగ్వస్‌వాలా కూడా మిగిలిన సహాయక సిబ్బందితో బయలుదేరుతారు.  దుబాయ్ మీదుగా కమర్షియల్ విమానంలో ఆటగాళ్లంతా వెళ్తారని సీనియర్ అధికారి చెప్పారు. ఐపీఎల్ 14వ సీజ‌న్ పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడోస్థానంలో ఉండగా.. ఢిల్లీ, చెన్నై జట్లు టాప్‌లో దూసుకెళ్లాయి. ఈ నెల 20న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో బెంగళూరు జట్టు త‌ల‌ప‌డ‌నుంది.
MS Dhoni : మెంటర్ గా ధోనీ..బీసీసీఐకి ఫిర్యాదు అందిందా ? ఎందుకు ?