IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం.. ఈ ముగ్గురు ఆటగాళ్లే సీఎస్‌కే టార్గెట్!

ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది.

Csk

IPL 2022 Auction:ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుండగా.. ఈ వేలంలో 590 మంది ఆట‌గాళ్లు పాల్గొన‌బోతున్నారు. ఈ వేలంలో సీఎస్‌కే ముగ్గురు ఓపెనర్లను టార్గెట్‌గా పెట్టుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో ధోని టార్గెట్‌నే చెన్నై సూపర్ కింగ్స్ అమలు చేస్తుంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఓపెనర్‌లను ముందుగా వేలంలో దక్కించుకోవడానికి సిద్ధమైంది చెన్నై సూపర్ కింగ్స్.

ముగ్గురు ఓపెనర్లు.. 1. ఫాప్ డూప్లెసిస్, 2. డేవిడ్ మలాన్ 3. ఉస్మాన్ ఖవాజా

ఫాప్ డూప్లెసిస్..
చెన్నై సూపన్ కింగ్స్‌కి డూప్లెసిస్ గతంలోనూ ఆడగా.. డుప్లెసిస్ స్థానంలో అతనిలాంటి అనుభవం ఉన్న ఆటగాడు పెట్టడం కష్టమే. ఎందుకంటే ఒకవైపు యాక్షన్, మరోవైపు రిలాక్స్‌డ్ భాగస్వామ్యం కావాలి. గత సీజన్‌లో CSKజట్టు అద్భుతమైన ఆరంభం ఇవ్వడానికి కారణం డూప్లెసిస్.

డేవిడ్ మలాన్..
ఇంగ్లండ్ తరఫున ఓపెనర్ ఆటగాడు డేవిడ్ మలాన్ మెరుగ్గా పరుగులు రాబడుతూ స్టార్ ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో మ్యాచ్‌లు ఆడే అవకాశం మాత్రం మలాన్‌కి రాలేదు. కానీ అతను నిలకడగా పరుగులు రాబట్టడం ద్వారా జట్టుకు ఉపయోగపడ్డాడు. కుడి చేతి, ఎడమ చేతి జంట ఓపెనింగ్‌లో ఉండాలి అనుకుని చెన్నై మలాన్‌ని తీసుకోవాలని భావిస్తుంది.

ఉస్మాన్ ఖవాజా..
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా రాణించాడు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ధోనీ నేతృత్వంలో పుణె జట్టుకు ఆడిన అనుభవం కూడా ఉంది. టీ20 క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి సీఎస్‌కేకి ఉపయోగపడుతాడు అని జట్టు అభిప్రాయపడుతోంది.