Shane Watson
IPL 2022: మాజీ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్‌గా అపాయింట్ చేసుకున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. దీంతో రిక్కీ పాంటింగ్ (హెడ్ కోచ్), ప్రవీణ్ ఆమ్రే (అసిస్టెంట్ కోచ్), అజిత్ అగార్కర్ (అసిస్టెంట్ కోచ్), జేమ్స్ హోప్స్ (బౌలింగ్ కోచ్)లతో పాటు షేన్ వాట్సన్ కూడా కోచ్ విభాగంలో కలిసిపోయారు.
అపాయింట్మెంట్ పై మాట్లాడిన వాట్సన్.. ‘ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే బెస్ట్ టీ20 టోర్నమెంట్. ప్లేయర్ గా అద్భుతమైన జ్ఞాపకాలను వదిలిపెట్టింది. 2008లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఒకడిగా ఉన్నా. ఆ తర్వాత ఆర్సీబీ, సీఎస్కేలలో ఆడాను. ప్లేయర్ గా అద్భుతమైన గుర్తుల్ని ఇచ్చింది ఐపీఎల్. ఇప్పుడు కోచింగ్ అవకాశాలను కల్పించింది’
‘గ్రేట్ రిక్కీ పాంటింగ్ నేతృత్వంలో పనిచేయడాన్ని గొప్పగా భావిస్తున్నా. కెప్టెన్ గా చాలా మంచి లీడర్ పాంటింగ్. ప్రపంచంలోనే బెస్ట్ కోచెస్ లో ఒకరైన పాంటింగ్ దో కలిసి పనిచేస్తున్నా. ఇంకా చాలా నేర్చుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. నేను నిజంగా ఎగ్జైటింగ్ గా ఉన్నానని’ షేన్ వాట్సన్ తెలియజేశాడు.
Read Also: దేశీవాలీ లీగ్ నుంచి షేన్ వాట్సన్ రిటైర్మెంట్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైటిల్ గెలిచేందుకు ముస్తాబవుతుంది. వారితో కలిసి పనిచేసేందుకు, నాకు సాధ్యమైనంత వరకూ కృషి చేస్తా. ఫస్ట్ టైటిట్ దక్కించుకుంటామనే సంతోషంలో ఉన్నానని’ షేన్ వాట్సన్ వివరించారు.
40 ఏళ్ల షేన్ వాట్సన్ 2008 నుంచి 2015 మధ్య రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2016, 17 సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఇక 2018 నుంచి 2020 మధ్య చెన్నై సూపర్ కింగ్స్ తో కలిసి పనిచేశాడు. మొత్తంగా 145 మ్యాచ్ లు ఆడి 3వేల 874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోనూ రాణించిన వాట్సన్ 92 వికెట్లు తీశాడు. 2016 సీజన్ లో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. బౌలింగ్ లో వాట్సన్ అత్యుత్తమ ప్రదర్శ ఇదే.