Telugu » Sports » Ipl 2022 Delhi Capitals Choose To Bowl After Wining Toss
IPL 2022: పంత్ వర్సెస్ రోహిత్.. ఢిల్లీ బౌలింగ్
ఐపీఎల్ 2022 సీజన్ తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం..
IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ లో రెండో మ్యాచ్ ను ఇరు జట్లు మరి కొద్ది క్షణాల్లో ఆరంభించనున్నాయి.
గత 5 మ్యాచ్‌ల్లో రికార్డులను పరిశీలిస్తే.. 2020 ఐపీఎల్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో (ఫైనల్ మ్యాచ్‌తో కలిపి) ముంబైనే విజయం వరించగా, గతేడాది 2 మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ సేన.. ముంబై ఇండియన్స్‌పై పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో గతేడాది ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ జట్టు భావిస్తుంది.