IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్‌ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!

IPL 2022: అదిగో టైటిల్.. ఈసారి ఆర్సీబీదే టైటిల్.. జెస్ట్ వెయిట్.. చూస్తుండండి.. ఈసారి సీజన్‌లో టైటిల్ కోహ్లీసేనకే.. అలా ఐపీఎల్ టైటిల్ కోసం 15ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తూ వస్తోంది. కానీ, ఆర్సీబీ కల కలగానే మిగిలిపోయింది.

IPL 2022: అదిగో టైటిల్.. ఈసారి ఆర్సీబీదే టైటిల్.. జెస్ట్ వెయిట్.. చూస్తుండండి.. ఈసారి సీజన్‌లో టైటిల్ కోహ్లీసేనకే.. అంటూ ఐపీఎల్ టైటిల్ కోసం 15ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తోంది.  బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షలా మారింది ఐపీఎల్ కప్.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అదృష్టవశాత్తూ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోయింది. రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో ఓటమి పాలైంది. ఈసారి కూడా బెంగళూరు టైటిల్ రేసులో ఇంటిదారి పట్టింది.

కోహ్లీ కల.. కలగానే మిగిలే.. వచ్చే సీజన్ కప్ కొట్టాల్సాందే.. 
15ఏళ్లుగా ఆర్సీబీ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. చివరి వరకు వచ్చి టైటిల్ రేసులో చేతులేత్తేస్తోంది. ఈసారైనా బెంగళూరుకు అదృష్టం కలిసివస్తుందేమో అనుకుంటే మళ్లీ నిరాశే పలకరించింది. అయితే, RCB గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా IPL టైటిల్ గెలవలేదు. కోహ్లి కల కలగానే మిగిలిపోయింది. ఐపీఎల్ ట్రోఫీ గెలవాలన్న కోహ్లీ కోరిక ఇంకా సజీవంగానే ఉంది. వచ్చే ఏడాది మళ్లీ కప్ కోసం బెంగళూరు ప్రయత్నిస్తోంది.

అయితే ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు చేరుకోవడం వరుసగా ఇది మూడో ఏడాది. అలాగే ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో ఆర్సీబీ అదృష్టం బాగానే కలిసి వస్తోంది. కానీ, విరాట్ కోహ్లి దురదృష్టం కాస్తా జట్టు భవితవ్యాన్ని నిర్దేశించినట్లుంది. ఫలితంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం రెండు అడుగుల దూరంలో టైటిల్ కోల్పోయింది. బహుషా ఈ పెయిన్ ఎంత బాధిస్తుందో.. ఒక్క విరాట్ కోహ్లికి తప్ప మరెవరికి తెలియకపోవచ్చు.

Ipl 2022 Just Wait, Wait, Wait For 15 Years… No One Knows This ‘pain’ Of Virat Kohli

ఆర్సీబీ గత 2 సీజన్లలో (2020, 2021)నూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈసారి టైటిల్‌కు దగ్గరగా విరాట్ కోహ్లీ ఆశలు ఆవిరైపోతాయని ఎవరూ ఊహించలేదు. 2011లో విరాట్‌ కోహ్లి నాయకత్వంలో ఆర్‌సీబీ మొదటిసారి టైటిల్‌ను కోల్పోయింది. ఆ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌ బెర్త్ దక్కించుకుంది.

కానీ, ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై విజయం సాధించింది. 2016లో బెంగళూరు కూడా ఫైనల్ చేరింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టైటిల్ దక్కించుకుంది. 2022లోనైనా బెంగళూరు టైటిల్ కొడుతుందేమోనని ఆశగా ఎదురుచూసిన జట్టు అభిమానులకు నిరాశే ఎదురైంది. వచ్చే సీజన్ లోనైనా బెంగళూరుకు కలిసి వస్తుందా? ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి మరి.

Read Also : IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్

ట్రెండింగ్ వార్తలు