Lsg Ipl 2022
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ… ఆండ్రూ టైని జట్టులోకి తీసుకోనుంది. మార్క్ వుడ్‌కు గాయం కావడంతో అతని స్థానంలో రీప్లేస్మెంట్ గా ఇంగ్లీష్ ప్లేయర్ ను తీసుకోనున్నట్లు ప్రకటించింది.
ఐపీఎల్ వేలంలో మార్క్ వుడ్‌ను రూ.7.5కోట్లకు కొనుగోలు చేసింది ఎల్ఎస్జీ.. ఇటీవల మణికట్టు ప్రాంతంలో గాయం అవడంతో తప్పుకున్నాడు. అదే సమయంలో మరో ఎక్స్‌పీరియెన్స్‌డ్ విదేశీ బౌలర్ కావాలని చూసిన జట్టుకు ఆండ్రూ టై దొరికాడు.
‘లక్నో సూపర్ జెయింట్స్ ఆండ్రూ టైని రీప్లేస్మెంట్ గా తీసుకోనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ స్థానంలో జట్టులోకి రానున్నారు. ఇంగ్లాండ్ తో వెస్టిండీస్ కు మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ సమయంలో వుడ్ కు గాయమైంది’ అని ఐపీఎల్ అఫీషియల్ స్టేట్మెంట్ లో విడుదల చేసింది.
IPL 2022 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. దిగ్గజ ప్లేయర్ దూరం!
ఈ LSG జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బయో బబుల్ నిబంధనల కారణంగా జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ ఐపీఎల్‌కు దూరమయ్యారు. మార్చి 28న మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ జరిగే మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ సీజన్ ఆరంభించనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు:
కేఎల్ రాహుల్(17 కోట్లు), స్టోయినిస్ (9.20 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), డికాక్ (6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), ఎవిన్ లూయిస్ (2 కోట్లు), దుశ్మంత చమీర (2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కైల్ మేయర్స్ (50 లక్షలు), మోసిన్‌ఖాన్ (20 లక్షలు), ఆయుశ్ బదోని (20 లక్షలు), కరణ్ సన్నీ శర్మ (20 లక్షలు), మయాంక్ యాదవ్ (20 లక్షలు), మనన్ వోహ్రా (20 లక్షలు)