IPL 2022 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. దిగ్గజ ప్లేయర్‌ దూరం!

IPL 2022 : మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ ఆరంభానికి ముందే జట్లలో ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఐపీఎల్ జట్లలో కీలకమైన ఆటగాళ్లే ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నారు.

IPL 2022 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. దిగ్గజ ప్లేయర్‌ దూరం!

Huge Blow To Lsg As This Big Player Ruled Out Of Ipl 2022

IPL 2022 : మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ ఆరంభానికి ముందే జట్లలో ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఐపీఎల్ జట్లలో కీలకమైన ఆటగాళ్లే ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నారు. ప్రస్తుతం ఆటగాళ్ల దూరమవ్వడం ఐపీఎల్ ప్రాంఛైజీ జట్లను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఐపీఎల్ కొత్త జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్లలో ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇంతలోనే మరో దిగ్గజ ఆటగాడు లక్నో జట్టు నుంచి వైదొలిగాడు.

ముందుగా జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్ జట్టుకు దూరమవ్వగా.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌ నుంచి తప్పుకోనున్నాడు. మోచేతి గాయం కారణంగా ఈ దిగ్గజ ప్లేయర్ (మార్క్‌ వుడ్‌) జట్టుకు దూరం కానున్నట్టు సమాచారం. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మార్క్ వుడ్ మోచేతికి గాయమైంది. అప్పటినుంచి మోచేయి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోకపోవడంతో IPL ఆరంభ మ్యాచ్ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మార్క్ వుడ్ ప్రాతినిధ్యం వహించడం లేదని ఇంగ్లండ్‌ బోర్డు లక్నో ఫ్రాంఛేజీకి సమాచారం ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.

Huge Blow To Lsg As This Big Player Ruled Out Of Ipl 2022 (1)

Huge Blow To Lsg As This Big Player Ruled Out Of Ipl 2022 

గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో కొత్తగా చేరిన సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ మార్క్ వుడ్ ను రూ.7.5 కోట్లకు సొంతం చేసుకుంది. నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వుడ్ 17 ఓవర్లు మాత్రమే వేశాడు. ఐపీఎల్‌-2022 సీజన్‌తో లక్నో జట్టు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ LSG జట్టుకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బయో బబుల్‌ నిబంధనల కారణంగా జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్‌ ఐపీఎల్‌కు దూరమయ్యారు. మార్చి 28న మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ జరిగే మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ సీజన్ ఆరంభించనుంది.

Read Also : IPL 2022 : గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పాండ్యా వస్తున్నాడు.. యో-యో టెస్టు పాస్..!