Ipl 2022 Lucknow Super Giants Jersey Leaked, Gujarat Titans To Launch Theirs At Narendra Modi Stadium
IPL 2022 : ఈ ఏడాది 2022 ఐపీఎల్ టీ20 లీగ్ 15వ ఎడిషన్‌లో కొత్తగా రెండు IPL టీంలు చేరుతున్నాయి. ఐపీఎల్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాయి. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రెండో టీం గుజరాత్ టైటాన్స్ జట్టు. ఈ రెండు జట్లు మార్చి 28న ఆరంభ మ్యాచ్‌లో ఒక్కొక్కటిగా తలపడనున్నాయి. అయితే ఈ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు సంబంధించి జెర్సీ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ జట్టుకు సంబంధించి జెర్సీని ఈ ఫ్రాంచైజీ అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఇంతలోనే లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీ లీక్ అయింది.
దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ప్రముఖ ర్యాపర్ బాద్షాతో ఓ ప్రమో సాంగ్ రూపొందించిన LSG ద్వారా జెర్సీని లాంచ్ చేయాలని నిర్ణయించారు. లీకైన ఫొటోలో ర్యాపర్ బాద్షా.. లైట్ స్కై బ్లూ కలర్, భుజాల దగ్గర ఆరెంజ్ కలర్ షేడ్‌తో జెర్సీని ధరించాడు. అయితే, అదే LSG జట్టు అధికారిక జెర్సీని ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ర్యాపర్ బాద్షా ఎల్ఎస్‌జీ లోగోను పట్టుకుని చిందులేయడం చూస్తుంటే.. అది కచ్చితంగా లక్నో సూపర్ జెయింట్స్ లోగో అని కన్ఫూర్మ్ చేసుకున్నారు లక్నో జెర్సీ ఫ్యాన్స్..
LSG ప్రాంచైజీ జట్టుతో పాటు మరో కొత్త జట్టు ఐపీఎల్ 2022 మెగా టోర్నీలోకి ఎంట్రీ ఇస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఫ్రాంచైనీ జెర్సీని ఇంకా లాంచ్ చేయలేదు. ఈ జట్టు తమ జెర్సీని ఆదివారం (మార్చి 13) నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్టు సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మార్చి 28న ఈ రెండు జట్లు వాంఖడే వేదికగా ఒకదానికొకటి తలపడనున్నాయి.
HERE-WE-GO, leaked footage of the ongoing shoot of @LucknowIPL theme song featuring @Its_Badshah. ?? #JerseyReveal ???#WeAreSuperGiants | #IPL2022#TATAIPL2022 #TataIPL #IPL pic.twitter.com/DSekgZmyNE
— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) March 9, 2022
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : కేఎల్ రాహుల్(17 కోట్లు), స్టోయినిస్ (9.20 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), డికాక్ (6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), ఎవిన్ లూయిస్ (2 కోట్లు), దుశ్మంత చమీర (2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కైల్ మేయర్స్ (50 లక్షలు), మోసిన్‌ఖాన్ (20 లక్షలు), ఆయుశ్ బదోని (20 లక్షలు), కరణ్ సన్నీ శర్మ (20 లక్షలు), మయాంక్ యాదవ్ (20 లక్షలు), మనన్ వోహ్రా (20 లక్షలు)
Badshah might be working on Lucknow Super Giants theme song for IPL 2022!#KLRahul | #LucknowSuperGiants | #IPL2022 pic.twitter.com/cYU95UtaIA
— Kunal Yadav (@kunaalyaadav) March 9, 2022
గుజరాత్ టైటాన్స్ జట్టు : హార్దిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు), మహ్మద్ షమీ (రూ. 6.25 కోట్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (రూ. 50 లక్షలు), లాకీ ఫెర్గూసన్ (రూ. 10) కోటి), అభినవ్ సదరంగాని (రూ. 2.6 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ. 9 కోట్లు), నూర్ అహ్మద్ (రూ. 30 లక్షలు), ఆర్ సాయి కిషోర్ (రూ. 3 కోట్లు), డొమినిక్ డ్రేక్స్ (1.10 కోట్లు), జయంత్ యాదవ్ (రూ. 1.70 కోట్లు) , విజయ్ శంకర్ (రూ. 1.40 కోట్లు), దర్శన్ నల్కండే (రూ. 20 లక్షలు), యష్ దయాల్ (రూ. 3.2 కోట్లు), అల్జారీ జోసెఫ్ (రూ. 2.40 కోట్లు), ప్రదీప్ సాంగ్వాన్ (రూ. 20 లక్షలు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ. 1.90 కోట్లు), మాథ్యూ వేడ్ (రూ. 2.40 కోట్లు), గురుకీరత్ సింగ్ (రూ. 50 లక్షలు), వరుణ్ ఆరోన్ (రూ. 50 లక్షలు).
Read Also : IPL 2022: ‘బెంగళూరు కెప్టెన్సీని కోహ్లీ వెనక్కి తీసుకోడు’