IPL auction 2022: వేలంలో “ఆ నలుగురు” కోసం భారీ డిమాండ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తర్వాతి సీజన్ వేలానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.

IPL auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తర్వాతి సీజన్ వేలానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. రేపు అంటే ఫిబ్రవరి 12వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరులో ఆటగాళ్ల వేలం స్టార్ట్ అవ్వనుంది. ఈసారి మెగా వేలం రెండు రోజుల కార్యక్రమం కాగా.. వేలంలో నలుగురు బ్యాట్స్‌మెన్లు కోసం భారీ డిమాండ్ ఉంది. వీరిపై కాసుల వర్షం కురవచ్చు.

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – ప్రాథమిక ధర రూ. 2 కోట్లు:
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి రిటైన్ చేయలేదు. మెగా వేలంలో అతని బేస్ ధర రూ.2 కోట్లు కాగా.. అతని కెప్టెన్ కోసం చాలా జట్లు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ డేవిడ్ వార్నర్‌ కోసం పోటీ పడవచ్చు. వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు వార్నర్ కావచ్చు.

శ్రేయాస్ అయ్యర్(భారతదేశం) – ప్రాథమిక ధర రూ. 2 కోట్లు:
IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్, ఈసారి ఏ జట్టుతో ఆడనున్నాడనేది అతిపెద్ద ప్రశ్న. నివేదికలు ప్రకారం.., కెప్టెన్సీ లేకపోవడంతో, అతను స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయ్యర్ బేస్ ధర రూ.2 కోట్లు. వేలంలో అతడి కోసం భారీ పోటీ ఉండవచ్చు.

క్వింటన్ డి కాక్(దక్షిణాఫ్రికా) – ప్రాథమిక ధర రూ. 2 కోట్లు:
ముంబయి ఇండియన్స్ తరఫున చాలా కాలంగా అద్భుత ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఈసారి వేలంలో భాగమయ్యాడు. వేలంలో డికాక్ కోసం అన్ని జట్లు పోటీ పడొచ్చు. గత అన్నీ సీజన్‌లలో ముంబైకి ఓపెనింగ్ అద్భుతంగా చేశారు.

ఇషాన్ కిషన్ (భారతదేశం) – బేస్ ధర రూ. 2 కోట్లు:
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ IPL 2020, 2021లో అద్భుతమైన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత అతనికి టీమ్ ఇండియాలో చోటు దక్కింది. లక్నో నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వరకు, కిషన్‌ కోసం అన్నీ జట్టు పోటీ పడవచ్చు.

ట్రెండింగ్ వార్తలు