IPL Mega-Auction : రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం.. తేదీలు ఇవే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

IPL 2022 mega-auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐపీఎల్ 2022 మెగా వేలం వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరుగనుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈసారి రెండు కొత్త ప్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. సంజీవ్ గోయెంకా RPSG Groupకు చెందిన Lucknow franchise, CVC కేపిటల్ అహ్మదాబాద్ జట్లకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (BCCI) అధికారికంగా క్లియరెన్స్ వచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నోలో ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్’ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. రెండు బిడ్‌లను గవర్నింగ్‌ కౌన్సిల్ ఆమోదించింది. ఎల్‌వోఐను త్వరలోనే జారీ చేస్తామని బ్రిజేష్ పటేల్‌ పేర్కొన్నారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగా వేలం జరుగనుందని బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. ముందుగానే రెండు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.


మరో ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడమే ఉందన్నారు. లక్నోకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్లుగా వ్యవహరించే ఛాన్స్ ఉందన్నారు. కొత్త జట్లకు రెండు వారాల ప్లేయర్లను ఎంచుకోవచ్చునని తెలిపారు. కొత్త ఫ్రాంచైజీ యాజమాన్యాలతో ఇప్పటికే మాట్లాడినట్టు తెలిపారు. ఆటగాళ్ల ఎంపిక కోసం 10 రోజుల నుంచి 2 వారాల సమయం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ సీజన్ భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

Read Also : Two-Wheeler Loans : టూవీలర్ కొంటున్నారా? L&T భారీ లోన్ ఆఫర్.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు