IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలం ఎప్పుడంటే? ఇండియాలోనే!

ఇండియన్ రిచెస్ట్ లీగ్.. ఐపీఎల్ మెగా వేలం రెండు రోజుల పాటు ఫిబ్రవరి నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి

Ipl

IPL 2022 Mega Auction: ఇండియన్ రిచెస్ట్ లీగ్.. ఐపీఎల్ మెగా వేలం రెండు రోజుల పాటు ఫిబ్రవరి నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI). ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఈ మెగా వేలాన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2022 ఫిబ్రవరి 7వ, 8వ తేదీల్లో నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.

కరోనా పరిస్థితులు సాధారణంగా ఉంటే మెగా వేలం ఈవెంట్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని, లేకుంటే ప్రత్యామ్నయం ఆలోచిస్తామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు సహా మొత్తం పది టీమ్‌లు రంగంలోకి రానున్నాయి.

కొత్తగా లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలు రానుండగా.. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్‌లో ముగ్గురు ఆటగాళ్లను తీసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నాయి. ఈ నెల 25వ తేదీలోపు కొత్త జట్లు ప్లేయర్లను ఎంచుకునే అవకాశం ఉండగా.. తర్వాత ఫైనల్‌ లిస్ట్‌ను తయారు చేసి బీసీసీఐ మెగా వేలం నిర్వహిస్తుంది. ఇండియాలో ఐపీఎల్ వేలం నిర్వహిస్తే మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారని బీసీసీఐ ప్రతినిధులు చెబుతున్నారు.