IPL 2022 : రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా.. హిట్ మ్యాన్ చేసిన తప్పు ఇదే..!

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు తప్పిదంతో హిట్ మ్యాన్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది.

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్ (Slow Over Rate) కారణంగా ముంబై జట్టు ఘోరంగా ఓడిపోయింది. స్లో ఓవర్ రేటు తప్పిదంగా పరిగణిస్తూ హిట్ మ్యాన్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో మొదటగా ముంబై బ్యాటింగ్ దిగింది. అయితే జట్టు 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత నిర్దేశిత లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 179/6తో విజయం సాధించింది. రోహిత్ శర్మ వృథా అయింది. ముంబై జట్టుపై స్లో ఓవర్ రేట్ తప్పిదం కారణంగా రోహిత్‌కు రూ.12 లక్షల జరిమానా వేశారు.

ఢిల్లీ గెలుపునకు చివరి 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వేసిన బసిల్ థంపీ 13 పరుగులు ఇచ్చాడు. ముంబై తమదే విజయమని ధీమాగా ఉన్న సమయంలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో డేనియల్ శామ్స్ బౌలింగ్‌ వేశాడు. 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. శామ్స్‌కి ఫస్ట్ బాల్‌కే అక్షర్ పటేల్ సిక్స్ బాదాడు. ఆ తర్వాత రెండో బంతికి సింగిల్‌ తీశాడు.

16 బంతుల్లో 21 పరుగులతో మ్యాచ్ ఢిల్లీ వైపు తిరిగింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్‌ డేనియల్ శామ్స్‌తో బంతి ఎలా వేయాలి అనేదానిపై ఎక్కువ సమయం చర్చలకే పరిమితమయ్యాడు. ఓవర్‌లో మిగిలిన 4 బంతులకీ రోహిత్ 6, 4,1 ,6 పరుగులు ఇచ్చేశాడు. ఈ నాలుగు బంతుల్లో బంతి బంతికి రోహిత్ శర్మ సూచనలు చేయడంతోనే సాగింది. అయినా ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో 24 పరుగులు రాబట్టింది ఢిల్లీ క్యాపిటల్స్..

12 బంతుల్లో 4 పరుగులు చేస్తే ఢిల్లీదే విజయం.. అప్పుడే అక్షర్ పటేల్ బౌండరీ బాదడంతో గెలుపు అనివార్యమైంది. ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. మ్యాచ్ గెలుపు కోసం మిగిలిన బంతులను ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై రోహిత్ మ్యాచ్ సమయాన్ని వృథా చేశాడు. ముంబైకి కేటాయించిన సమయాన్ని అధిగమించాడు. నిర్దేశించిన సమయంలోగా ఓవర్ వేయాల్సి ఉండగా.. ఒక ఓవర్ ముంబై తక్కువగా వేసింది. స్లో ఓవర్ రేటు తప్పిదం కింద రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ 2022లో కెప్టెన్‌గా రోహిత్ చేసింది మొదటి తప్పు కావడంతో రూ.12 లక్షల జరిమానా పడింది. ఒకవేళ అదే తప్పిదం జరిగితే జరిమానా రెట్టింపు పడే అవకాశం ఉంది.

Read Also : IPL 2022: కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ట్రెండింగ్ వార్తలు