IPL-2023
IPL-2023: టీ20 క్రికెట్లో అసలు సిసలైన మజా ఉండే ఐపీఎల్ లో 2008 నుంచి ఇప్పటివరకు ధోనీ తడాఖా చూపిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ ( MS Dhoni) ఉన్నాడు. ఇక, డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గా వీవీఎస్ లక్ష్మణ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా షేన్ వార్న్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా యువరాజ్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ (Chennai Super Kings) గా మాత్రం ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నాడు. 2008 నుంచే ఐపీఎల్ లో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2015 జులై నుంచి రెండేళ్ల పాటు సస్పెన్షన్ కు గురైంది. 2013లో ఐపీఎల్ బెట్టింగ్ కేసు నేపథ్యంలో సీఎస్కేను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2018లో మళ్లీ ఈ టీమ్ ఆడి అదే సీజన్ లో కప్పు గెలుచుకుంది.
ధోనీ నాయకత్వంలోనే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2008లో కెప్టెన్లుగా ఉన్న క్రికెటర్లు అందరూ ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ధోనీ మాత్రం ఇప్పటికే అదే చిరునవ్వుతో ఇవాళ ఇతర జట్ల కెప్టెన్లతో ఫొటోలకు పోజులు ఇచ్చాడు. ధోనీ అభిమానులు అప్పటి, ఇప్పటి కెప్టెన్ల ఫొటోలను పోస్ట్ చేస్తూ అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2008 సీజన్ కెప్టెన్లు
IPL-2008
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ, డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గా వీవీఎస్ లక్ష్మణ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రాహుల్ ద్రవిడ్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా షేన్ వార్న్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా యువరాజ్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.
2023 సీజన్ కెప్టెన్లు
IPL-2023
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్రామ్.
IPL-2023: Are You Ready అంటూ ఐపీఎల్ జట్ల కెప్టెన్ల ఫొటో.. వారిలో ఒక కెప్టెన్ మిస్సింగ్