CSK vs GT
CKS vs GT Qualifier 1: ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా చెన్నై నిలిచింది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా చెన్నై నిలిచింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. దీంతో చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వరుస బంతుల్లో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. పతిరన బౌలింగ్‌లో గైక్వాడ్ క్యాచ్ అందుకోవడంతో విజయ్ శంకర్(14) ఔట్ కాగా.. ఆ మరుసటి బంతికి దర్శన్ నల్కండే రనౌట్ అయ్యాడు. దీంతో 136 పరుగుల(17.4వ ఓవర్) వద్ద గుజరాత్ 8వ వికెట్ కోల్పోయింది.
గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 98 పరుగుల(14.3) వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్(42) కాన్వే చేతికి చిక్కాడు. దీంతో గుజరాత్ 88 పరుగుల(13.1వ ఓవర్ ) వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 88 పరుగుల(12.5వ ఓవర్) వద్ద చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు గుజరాత్ స్కోరు 88/4. శుభ్‌మన్ గిల్(42), విజయ్ శంకర్(0) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మహేశ్ తీక్షణ క్యాచ్ అందుకోవడంతో విజయ్ శంకర్(17) ఔట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 72 పరుగుల(10.3వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు గుజరాత్ స్కోరు 74/3. శుభ్‌మన్ గిల్(34), డేవిడ్ మిల్లర్(1) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో జడేజా క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్యా(8) ఔట్ అయ్యాడు. దీంతో 41 పరుగుల(5.5వ ఓవర్) వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు గుజరాత్ స్కోరు 41/2. శుభ్‌మన్ గిల్(20), దాసున్ షనక(0) లు క్రీజులో ఉన్నారు.
లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు షాక్ తగిలింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా(12) పతిరన చేతికి చిక్కాడు. దీంతో 22 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 22/1. గిల్(9), హార్దిక్ పాండ్యా(0) లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా డేవాన్ కాన్వే(40; 34 బంతుల్లో 4 ఫోర్లు) పర్వాలేనిపించాడు. శివమ్ దూబే(1), మహేంద్ర సింగ్ ధోని(1) లు విఫలం కాగా అజింక్యా రహానే(17), అంబటి రాయుడు(17)లకు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంతో విఫలం అయ్యాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా(22; 16 బంతుల్లో 2 ఫోర్లు) వేగంగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీయగా దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో దాసున్ షనక క్యాచ్ అందుకోవడంతో అంబటి రాయుడు(17) ఔట్ అయ్యాడు. దీంతో148 పరుగుల వద్ద చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు చెన్నై స్కోరు 148/5. రవీంద్ర జడేజా(10), ధోని(0) క్రీజులో ఉన్నారు.
చెన్నై స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో అజింక్యా రహానే(17) ఔట్ కాగా..మహ్మద్ షమీ బౌలింగ్‌లో డేవాన్ కాన్వే(40) రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 125 పరుగుల(15.1) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
స్వల్ప వ్యవధిలో చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబే(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 90 పరుగుల(11.3వ ఓవర్) వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది.
ఎట్టకేలకు గుజరాత్ బౌలర్లు వికెట్ పడగొట్టారు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో మిల్లర్ క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్(60) ఔట్ అయ్యాడు. దీంతో 87 పరుగుల(10.3వ ఓవర్) వద్ద చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది.
మోహిత్ శర్మ తొమ్మిదో ఓవర్‌ను వేశాడు. రెండో బంతికి ఫోర్ కొట్టి 36 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రుతురాజ్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరి.
చెన్నై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను నూర్ అహ్మద్ వేయగా కాన్వే, గైక్వాడ్‌లు చెరో ఫోర్ కొట్టడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు చెన్నై స్కోరు 49/0. రుతురాజ్ గైక్వాడ్(33), డెవాన్ కాన్వే(14) లు క్రీజులో ఉన్నారు.
కీలక మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. మూడు ఓవర్లకు చెన్నై స్కోరు 23/0. రుతురాజ్ గైక్వాడ్(18), డెవాన్ కాన్వే(3) లు క్రీజులో ఉన్నారు.
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.