GT vs MI
IPL 2023, GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది
ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది.
ముంబై మరో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మహ్మద్ షమీ క్యాచ్ అందుకోవడంతో నేహాల్ వధేరా(40) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 137 పరుగుల(17.4వ ఓవర్) వద్ద ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు ముంబై స్కోరు 139/8. అర్జున్ టెండూల్కర్(2), జాసన్ బెహ్రెండోర్ఫ్(1)క్రీజులో ఉన్నాడు.
ముంబై మరో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా రనౌట్ అయ్యాడు. దీంతో ముంబై 135 పరుగుల(17.1వ ఓవర్) వద్ద ఏడో వికెట్ కోల్పోయిం
మహ్మద్ షమీ ఓవర్‌లో నేహాల్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు ముంబై స్కోరు 135/6. నేహాల్ వధేరా(39), పీయూష్ చావ్లా(18) క్రీజులో ఉన్నాడు.
మోహిత్ శర్మ ఓవర్‌లో నేహాల్ వధేరా, పీయూష్ చావ్లాలు చెరో సిక్స్ కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు ముంబై స్కోరు 129/6. నేహాల్ వధేరా(34), పీయూష్ చావ్లా(17) క్రీజులో ఉన్నాడు.
మోహిత్ శర్మ ఓవర్‌లో పీయూష్ చావ్లా ఫోర్ కొట్టడంతో 9 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబై స్కోరు 99/6. నేహాల్ వధేరా(14), పీయూష్ చావ్లా(7) క్రీజులో ఉన్నాడు.
ముంబై వరుసగా వికెట్లు కోల్పోతుంది. సూర్యకుమార్ యాదవ్(23) పెవిలియన్‌కు చేరుకున్నాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 90 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు ముంబై స్కోరు 90/6. నేహాల్ వధేరా(12) క్రీజులో ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ వేగం పెంచాడు. రషీద్ ఖాన్ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు ముంబై స్కోరు 75/5. నేహాల్ వధేరా(1), సూర్యకుమార్ యాదవ్(19) క్రీజులో ఉన్నారు.
ముంబై ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి గ్రీన్ ఔట్ కాగా.. నాలుగో బంతికి టిమ్ డేవిడ్(0) మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ముంబై 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లకు ముంబై స్కోరు 59/5. నేహాల్ వధేరా(0), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.
నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు కొట్టబోయి కామెరూన్ గ్రీన్(33) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 59 పరుగుల(10.2వ ఓవర్) వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది.
పదో ఓవర్‌ను రషీద్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ముంబై స్కోరు 58/3. కామెరూన్ గ్రీన్(33), సూర్యకుమార్ యాదవ్(3) క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను నూర్ అహ్మద్ వేశాడు. మూడో బంతికి గ్రీన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు ముంబై స్కోరు 52/3. కామెరూన్ గ్రీన్(30), సూర్యకుమార్ యాదవ్(1) క్రీజులో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ ను రషీద్ ఖాన్ గట్టి దెబ్బతీశాడు. మూడో బంతికి ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన రషీద్ ఆఖరి బంతికి తిలక్ వర్మను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 45 పరుగుల (7.6వ ఓవర్) వద్ద ముంబై మూడో వికెట్‌ను కోల్పోయింది. 8 ఓవర్లకు ముంబై స్కోరు 45/3. కామెరూన్ గ్రీన్(23), సూర్యకుమార్ యాదవ్(0) క్రీజులో ఉన్నారు.
ముంబై మరో వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న ఇషాన్ కిషన్(13)ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో 43 పరుగుల వద్ద(7.3వ ఓవర్) ముంబై రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఏడో ఓవర్‌ను నూర్ అహ్మద్ వేశాడు. నాలుగో బంతికి గ్రీన్ సిక్స్ కొట్టడంతో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు ముంబై స్కోరు 42/1. ఇషాన్ కిషన్ (13), కామెరూన్ గ్రీన్(22) క్రీజులో ఉన్నారు.
ముంబై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను రషీద్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. 6 ఓవర్లకు ముంబై స్కోరు 29/1. ఇషాన్ కిషన్ (10), కామెరూన్ గ్రీన్(12) క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. మూడో బంతికి ఇషాన్ కిషన్ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై స్కోరు 26/1. ఇషాన్ కిషన్ (2), కామెరూన్ గ్రీన్(10) క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. మూడో బంతికి కామెరూన్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ముంబై స్కోరు 18/1. ఇషాన్ కిషన్ (2), కామెరూన్ గ్రీన్(9) క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. ఈ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 ఓవర్లకు ముంబై స్కోరు 6/1. ఇషాన్ కిషన్ (2), కామెరూన్ గ్రీన్(1) క్రీజులో ఉన్నారు.
ముంబైకి భారీ షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ(2) పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 4 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. 2 ఓవర్లకు ముంబై స్కోరు 4/1. ఇషాన్ కిషన్ (1) క్రీజులో ఉన్నాడు
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటర్లు బరిలోకి దిగారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు వచ్చారు. తొలి ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. ఈ ఓవర్‌లో రెండు పరుగులు వచ్చాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా డేవిడ్ మిల్లర్(46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆఖర్లో తెవాటియా (20 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబై ముందు భారీ లక్ష్యం నిలిచింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయలు ఒక్కొ వికెట్ పడగొట్టాడు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. దూకుడగా ఆడే క్రమంలో అభినవ్ మనోహర్(42) ఔట్ అయ్యాడు. రిలే మెరెడిత్ బౌలింగ్‌లో బెహ్రెండోర్ఫ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 172 పరుగుల వద్ద(18.1వ ఓవర్) గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. తెవాటియా ఒకటి, మిల్లర్ రెండు సిక్స్‌లు కొట్టడంతో ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు గుజరాత్ స్కోరు 191/5. రాహుల్ తెవాటియా(7), డేవిడ్ మిల్లర్(46) లు క్రీజులో ఉన్నారు.
అభినవ్ మనోహర్ దూకుడుగా ఆడుతున్నాడు. బెహ్రెండోర్ఫ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మిల్లర్ సైతం ఓ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు గుజరాత్ స్కోరు 172/4. అభినవ్ మనోహర్(42), డేవిడ్ మిల్లర్(34) లు క్రీజులో ఉన్నారు.
రిలే మెరెడిత్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్‌లు చెరొక ఫోర్ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు గుజరాత్ స్కోరు 150/4. అభినవ్ మనోహర్(29), డేవిడ్ మిల్లర్(25) లు క్రీజులో ఉన్నారు.
బెహ్రెండోర్ఫ్ వేసిన పదహారో ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు గుజరాత్ స్కోరు 137/4. అభినవ్ మనోహర్(22), డేవిడ్ మిల్లర్(19) లు క్రీజులో ఉన్నారు.
అభినవ్ మనోహర్ దూకుడు పెంచాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో రెండు ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు గుజరాత్ స్కోరు 130/4. అభినవ్ మనోహర్(18), డేవిడ్ మిల్లర్(17) లు క్రీజులో ఉన్నారు.
కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో మిల్లర్ భారీ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 10 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు గుజరాత్ స్కోరు 113/4. అభినవ్ మనోహర్(2), డేవిడ్ మిల్లర్(16) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. విజయ్‌శంకర్ (19) ఔట్ అయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు. దీంతో 101 పరుగుల వద్ద(12.2వ ఓవర్) గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు గుజరాత్ స్కోరు 103/4. అభినవ్ మనోహర్(1), డేవిడ్ మిల్లర్(6) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న గిల్(56) ఔట్ అయ్యాడు. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో ఉన్న సూర్యకుమార్ చేతికి చిక్కాడు. దీంతో 91 పరుగుల వద్ద(11.1వ ఓవర్) గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు గుజరాత్ స్కోరు 99/3. విజయ్‌శంకర్(17), డేవిడ్ మిల్లర్(6) లు క్రీజులో ఉన్నారు.
రిలే మెరెడిత్ ఓవర్‌లో ఐదో బంతికి శుభ్‌మన్ గిల్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు గుజరాత్ స్కోరు 91/2. విజయ్‌శంకర్(15), శుభమాన్ గిల్(56) లు క్రీజులో ఉన్నారు.
కుమార్ కార్తికేయ పదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని రెండు, మూడు బంతులను విజయ్ శంకర్ వరుసగా 4,6 సిక్స్ బాదాడు. ఐదో బంతికి గిల్ ఫోర్ కొట్టాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి 30 బంతుల్లో ఐపీఎల్‌లో 17వ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 84/2. విజయ్‌శంకర్(14), శుభమాన్ గిల్(50) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. తొలి బంతికి గిల్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు గుజరాత్ స్కోరు 68/2. విజయ్‌శంకర్(3), శుభమాన్ గిల్(45) లు క్రీజులో ఉన్నారు.
కుమార్ కార్తికేయ ఎనిమిదో ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు గుజరాత్ స్కోరు 60/2. విజయ్‌శంకర్(2), శుభమాన్ గిల్(38) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన పాండ్యా(13) సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో గుజరాత్ 50 పరుగుల వద్ద(6.1వ ఓవర్) రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు గుజరాత్ స్కోరు 55/2. విజయ్‌శంకర్(2), శుభమాన్ గిల్(33) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ బ్యాటర్లు గిల్, పాండ్యాలు క్రమంగా వేగం పెంచుతున్నారు. ఆరో ఓవర్‌ను కామెరూన్ గ్రీన్ వేయగా గిల్ వరుసగా 4,4,6 బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 17 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు గుజరాత్ స్కోరు 50/1. హార్ధిక్ పాండ్యా(13), శుభమాన్ గిల్(31) లు క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను రిలే మెరెడిత్ వేశాడు. రెండో బంతికి గిల్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 10 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 33/1. హార్ధిక్ పాండ్యా(11), శుభమాన్ గిల్(16) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను బెహ్రెండోర్ఫ్ వేశాడు. ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్టడంతో మొత్తంగా 6 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు గుజరాత్ స్కోరు 23/1. హార్ధిక్ పాండ్యా(10), శుభమాన్ గిల్(9) లు క్రీజులో ఉన్నారు.
ఆదిలోనే గుజరాత్ జట్టుకు షాక్ తగిలింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఓపెనర్ సాహా(4) ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 12పరుగుల వద్ద(2.1వ ఓవర్) గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 17/1. హార్దిక్ పాండ్యా(5), శుభ్‌మన్ గిల్(8) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను బెహ్రెండోర్ఫ్ వేశాడు. మూడో బంతికి శుభ్‌మన్ గిల్ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు గుజరాత్ స్కోరు 12/0. వృద్ధిమాన్ సాహా(4), శుభమాన్ గిల్(8) లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ వేశాడు. ఈ ఓవర్‌లో నాలుగు పరుగులు వచ్చాయి.
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.