IPL 2023, CSK vs LSG : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో భాగంగా నాలుగో రోజు మ్యాచ్ జరిగింది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

IPL 2023

IPL 2023, CSK vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.  ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య చెన్నై స్టేడియంలో జరిగింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 Apr 2023 11:14 PM (IST)

    6 వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

    IPL 2023, CSK vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య చెన్నై స్టేడియంలో జరుగుతోంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 6 వికెట్లు కోల్పోయింది. అంతకముందు టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది.

  • 03 Apr 2023 10:52 PM (IST)

    5 వికెట్ల నష్టానికి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 130 పరుగులు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య చెన్నై స్టేడియంలో జరుగుతోంది. 5 వికెట్ల నష్టానికి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 130 పరుగులు చేసింది. అంతకముందు టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది.

  • 03 Apr 2023 09:24 PM (IST)

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టార్గెట్ 218 పరుగులు

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు ముందు చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 31 బంతులు ఆడి 57 పరుగులు తీశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే దూకుడుగా ఆడి, 28 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో 47 పరుగులతో రాణించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

  • 03 Apr 2023 09:06 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన చెన్నై

    చెన్నై జట్టు 5వ వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ 8 పరుగులు చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. చెన్నై స్కోరు 178/5 (17 ఓవర్లకి)గా ఉంది.

  • 03 Apr 2023 08:56 PM (IST)

    నాలుగో వికెట్

    చెన్నై జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ 19 పరుగులు చేసి రవి బిష్ణోయి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. చెన్నై స్కోరు 166/4 (15.2 ఓవర్లకి)గా ఉంది.

  • 03 Apr 2023 08:49 PM (IST)

    మూడో వికెట్ డౌన్

    చెన్నై జట్టు మూడో వికెట్ కోల్పోయింది. శివం దూబె 27 పరుగులు తీసి రవి బిష్ణోయి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

  • 03 Apr 2023 08:33 PM (IST)

    భారీ షాటుకు యత్నించి కాన్వే క్యాచ్ ఔట్

    చెన్నై జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే దూకుడుగా ఆడి, భారీ షాటుకు యత్నించి మార్క్ వుడ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అతడు 28 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. క్రీజులో శివం దూబె (1) ఉన్నాడు. మోయిల్ అలీ క్రీజులోకి వచ్చాడు.

  • 03 Apr 2023 08:28 PM (IST)

    తొలి వికెట్ డౌన్

    చెన్నై జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ బాదిన అతడు అనంతరం కొద్దిసేపటికే రవి బిష్ణోయి బౌలింగ్ లో వెనుదిరిగాడు. స్కోరు 10 ఓవర్లకు 113/1గా ఉంది.

  • 03 Apr 2023 08:16 PM (IST)

    4 సిక్సులు 2 ఫోర్లతో రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ

    చెన్నై జట్టు ఓపెనర్లు దంచికొడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ 25 బంతుల్లో 4 సిక్సులు 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఇది అతడికి ఐపీఎల్ లో 12వ హాఫ్ సెంచరీ. ఇక మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 4 ఫోర్లు బాది 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 03 Apr 2023 08:02 PM (IST)

    5 ఓవర్లలో 60 పరుగులు

    చెన్నై జట్టు ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 5 ఓవర్లలో 60 పరుగులు చేశారు. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40), డెవాన్ కాన్వే (18)ఉన్నారు.

  • 03 Apr 2023 07:48 PM (IST)

    2 ఓవర్లకు 23 పరుగులు

    చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 2 ఓవర్లకు 23గా ఉంది. క్రీజులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (6), డెవాన్ కాన్వే(11) ఉన్నారు.

  • 03 Apr 2023 07:42 PM (IST)

    2022లో లఖ్‌నవూ జట్టు పాయింట్లు

    ఐపీఎల్-2022లో లఖ్‌నవూ జట్టు పాయింట్ల టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది.

    LSG

    ఐపీఎల్-2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో లఖ్‌నవూ జట్టు 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ ప్లస్ 2.500గా ఉంది. ఇప్పటివరకు 10 జట్లు ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడాయి.

  • 03 Apr 2023 07:35 PM (IST)

    మైదానంలోపల పరుగులు పెట్టించిన శునకం..

    మైదానం లోపలికి ఓ శునకం వచ్చింది. దీంతో బ్యాటింగ్ కాసేపు ఆగింది. కుక్కను పట్టుకోవడానికి సిబ్బంది పరుగులు తీశారు. చివరకు దాన్ని పట్టుకుని తీసుకెళ్లారు.

  • 03 Apr 2023 07:31 PM (IST)

    ఓపెనర్లుగా రుతురాజ్, కాన్వే

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే వచ్చారు.

  • 03 Apr 2023 07:08 PM (IST)

    ధోనీ సేన

    చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ(కెప్టెన్), శివం దూబే, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, హంగర్గేకర్

  • 03 Apr 2023 07:08 PM (IST)

    కేఎల్ రాహుల్ సేన

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హూడా, క్రునాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ , ఆయుష్ బడోని, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్

  • 03 Apr 2023 07:02 PM (IST)

    లఖ్‌నవూ బౌలింగ్

    లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.