IPL 2023, PBKS vs RCB: పంజాబ్ పై బెంగ‌ళూరు విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

PBKS vs RCB

IPL 2023, PBKS vs RCB: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 20 Apr 2023 07:05 PM (IST)

    బెంగ‌ళూరు విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46), జితేశ్ శ‌ర్మ‌(41) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయ‌గా, హ‌స‌రంగా రెండు వికెట్లు, పార్నెల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 20 Apr 2023 07:00 PM (IST)

    పంజాబ్ తొమ్మిది డౌన్‌

    ఒకే ఓవ‌ర్‌లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది.మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన 18 ఓవ‌ర్‌లోని మూడో బంతికి హ‌ర్ ప్రీత్ బ్రార్(13), ఆఖ‌రి బంతికి నాథన్ ఎల్లిస్(1) క్లీన్ బౌల్డ్ అయ్యారు. 18 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 149/9. జితేశ్ శ‌ర్మ‌(41), అర్ష్‌దీప్ సింగ్ (0)క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 06:47 PM (IST)

    జితేశ్ శ‌ర్మ దూకుడు

    జితేశ్ శ‌ర్మ దూకుడుగా ఆడుతున్నాడు. విజ‌య్ కుమార్ బౌలింగ్‌లో ఓ సిక్స్‌, ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 138/7. జితేశ్ శ‌ర్మ‌(36), హ‌ర్‌ప్రీత్ బార్‌(9) క్రీజులో ఉన్నారు

  • 20 Apr 2023 06:36 PM (IST)

    షారుక్ ఖాన్ ఔట్‌

    పంజాబ్ జ‌ట్టు వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోతుంది. హ‌స‌రంగా బౌలింగ్‌లో షారుక్ ఖాన్(7) స్టంపౌట్ అయ్యాడు. దీంతో 106 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 110/7. జితేశ్ శ‌ర్మ‌(13), హ‌ర్‌ప్రీత్ బార్‌(4) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 06:26 PM (IST)

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఔట్‌

    పంజాబ్ జ‌ట్టు మ‌రో వికెట్‌ను కోల్పోయింది. వేన్ పార్నెల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్(46) అదే ఊపులో మ‌రో షాట్‌కు య‌త్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 103/6. జితేశ్ శ‌ర్మ‌(11), షారుక్ ఖాన్‌(6) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 06:21 PM (IST)

    సగం వికెట్లు పాయె

    పంజాబ్ జ‌ట్టు మ‌రో వికెట్‌ను కోల్పోయింది. విజ‌య్‌కుమార్ వేసిన ప‌దో ఓవ‌ర్‌లోని ఐదో బంతికి సామ్ క‌ర‌న్‌(10) ర‌నౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 76 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 77/5. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39), జితేశ్ శ‌ర్మ‌(0) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 06:11 PM (IST)

    ధాటిగా ఆడుతున్న ప్ర‌భ్‌సిమ్ర‌న్‌

    ప్ర‌భ్‌సిమ్ర‌న్ ధాటిగా ఆడుతున్నాడు. హ‌స‌రంగ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో రెండు సిక్స‌ర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 70/4. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(37), సామ్ క‌ర‌న్‌(5) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 05:59 PM (IST)

    ఆర్‌సీబీ బౌల‌ర్ల జోరు.. పంజాబ్ ఫోర్ డౌన్‌

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన ఆరో ఓవ‌ర్‌లోని మూడో బంతికి హ‌ర్‌ప్రీత్ సింగ్ భాటియా(13) ర‌నౌట్ అయ్యాడు. 6 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 49/4. ప్రభసిమ్రాన్ సింగ్(21), సామ్ క‌ర‌న్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 05:50 PM (IST)

    లివింగ్‌స్టోన్ ఔట్‌

    ఆర్‌సీబీ బౌల‌ర్లు జోరు కొన‌సాగిస్తుండడంతో పంజాబ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. సిరాజ్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్(2) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో 27 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 32/3. ప్రభసిమ్రాన్ సింగ్(13), హర్‌ప్రీత్ సింగ్‌ (5)క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 05:39 PM (IST)

    మాథ్యూ షార్ట్ ఔట్‌

    పంజాబ్ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. హ‌స‌రంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 3 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 27/2. ప్రభసిమ్రాన్ సింగ్(13), లియామ్ లివింగ్‌స్టోన్(2) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 05:31 PM (IST)

    పంజాబ్‌కు షాకిచ్చిన సిరాజ్‌

    175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్‌కు ఆర్‌సీబీ బౌల‌ర్ సిరాజ్ షాకిచ్చాడు. మొద‌టి ఓవ‌ర్‌లోని రెండో బంతికే అథర్వ తైదే(4)ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. ప్రభసిమ్రాన్ సింగ్(4), మాథ్యూ షార్ట్(1) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 05:07 PM (IST)

    పంజాబ్ విజ‌య ల‌క్ష్యం 175

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. డుప్లెసిస్‌(84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి(59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. దినేశ్ కార్తిక్‌(7), మాక్స్‌వెల్(0)లు విఫ‌లం అయ్యారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయ‌గా నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. పంజాబ్ విజ‌య ల‌క్ష్యం 175.

  • 20 Apr 2023 04:56 PM (IST)

    డుప్లెసిస్ ఔట్‌

    దూకుడుగా ఆడే క్ర‌మంలో డుప్లెసిస్(84) ఔట్ అయ్యాడు. నాథన్ ఎల్లిస్ వేసిన 18 ఓవ‌ర్‌లోని రెండో బంతికి సిక్స్ కొట్టిన డుప్లెసిస్ ఆ మ‌రుస‌టి బంతికి భారీ షాట్‌కు య‌త్నించి సామ్‌క‌ర్ర‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 18 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 154/3. దినేశ్ కార్తిక్‌(3), మహిపాల్ లోమ్రోర్(0) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:50 PM (IST)

    రెండు బంతుల్లో రెండు వికెట్లు

    ఆర్‌సీబీకి షాకిచ్చాడు హర్‌ప్రీత్ బ్రార్‌. 17 ఓవ‌ర్‌లోని తొలి బంతికి విరాట్ కోహ్లీ(59) జితీశ్ శ‌ర్మ పట్టిన అద్భుత‌మైన క్యాచ్ కి ఔట్ కాగా రెండో బంతికి మ్యాక్స్ వెల్(0) అథర్వ తైదే చేతికి చిక్కాడు. దీంతో వ‌రుస బంతుల్లో ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 145/2. దినేశ్ కార్తిక్‌(1), ఫాఫ్ డుప్లెసిస్(78) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:38 PM (IST)

    కోహ్లి సిక్స్‌

    నాథన్ ఎల్లిస్ వేసిన 15వ‌ ఓవ‌ర్ లోని ఐదో బంతిని విరాట్ కోహ్లి సిక్స్‌గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 130/0. విరాట్ కోహ్లీ(57), ఫాఫ్ డుప్లెసిస్(67) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:34 PM (IST)

    విరాట్ కోహ్లి హాఫ్ సెంచ‌రీ

    అర్ష్‌దీప్ సింగ్ సింగ్ వేసిన 14వ ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి ఫోర్ కొట్టిన కోహ్లి 40 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 118/0. విరాట్ కోహ్లీ(50), ఫాఫ్ డుప్లెసిస్(64) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:32 PM (IST)

    పుంజుకుంటున్న పంజాబ్ బౌల‌ర్లు

    వికెట్లు తీయ‌న‌ప్ప‌టికి పంజాబ్ బౌల‌ర్లు క్ర‌మంగా పుంజుకుంటున్నారు. సామ్ క‌ర‌న్ వేసిన 12వ ఓవ‌ర్‌లో 5, రాహుల్ చాహ‌ర్ వేసిన 13 ఓవ‌ర్‌లో ఐదు ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 108/0. విరాట్ కోహ్లీ(44), ఫాఫ్ డుప్లెసిస్(61) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:15 PM (IST)

    డుప్లెసిస్ అర్ధ‌శ‌త‌కం

    లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ప‌దో ఓవ‌ర్‌లో డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్టాడు. ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి సింగిల్ తీసి ఐపీఎల్‌లో 29వ అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 91/0. విరాట్ కోహ్లీ(38), ఫాఫ్ డుప్లెసిస్(50) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 04:01 PM (IST)

    4 ప‌రుగులు

    రాహుల్ చాహర్ వేసిన ఏడో ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 63/0. విరాట్ కోహ్లీ(32), ఫాఫ్ డుప్లెసిస్(28) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:56 PM (IST)

    ప‌వర్ ప్లే

    బెంగ‌ళూరు ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. సామ్ క‌ర‌న్ వేసిన ఆరో ఓవ‌ర్‌లో డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్ట‌డంతో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 59/0. విరాట్ కోహ్లీ(29), ఫాఫ్ డుప్లెసిస్(27) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:52 PM (IST)

    10 ప‌రుగులు

    నాథన్ ఎల్లిస్ వేసిన ఐదో ఓవ‌ర్‌లో డుప్లెసిస్, కోహ్లి చెరో ఫోర్ కొట్టారు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 49/0. విరాట్ కోహ్లీ(25), ఫాఫ్ డుప్లెసిస్(23) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:47 PM (IST)

    డుప్లెసిస్ రెండు సిక్స్‌లు

    హర్‌ప్రీత్ బ్రార్ వేసిన నాలుగో ఓవ‌ర్‌లో ఫాప్ డుప్లెసిస్ రెండు సిక్స్‌లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 39/0. విరాట్ కోహ్లీ(20), ఫాఫ్ డుప్లెసిస్(18) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:44 PM (IST)

    దూకుడు పెంచిన కోహ్లి

    విరాట్ కోహ్లి క్ర‌మంగా దూకుడు పెంచుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 22/0. విరాట్ కోహ్లీ(19), ఫాఫ్ డుప్లెసిస్(2) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:39 PM (IST)

    విరాట్ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను హర్‌ప్రీత్ బ్రార్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో కోహ్లి ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 6 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 11/0. విరాట్ కోహ్లీ(9), ఫాఫ్ డుప్లెసిస్(1) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 03:35 PM (IST)

    తొలి ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు

    టాస్ ఓడిన ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఓపెన‌ర్లుగా విరాట్ కోహ్లీ(4), ఫాఫ్ డుప్లెసిస్‌(1)లు బ‌రిలోకి దిగారు. అర్ష్‌దీప్ సింగ్ మొద‌టి ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో5 ప‌రుగులు వ‌చ్చాయి.

  • 20 Apr 2023 03:10 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్

  • 20 Apr 2023 03:09 PM (IST)

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్