IPL 2023, RR vs SRH: ఉత్కంఠ పోరులో రాజ‌స్థాన్ పై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad) విజ‌యం సాధించింది.

RR vs SRH

IPL 2023, RR vs SRH: IPL 2023, RR vs SRH: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad) విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 07 May 2023 11:11 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

    జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) జ‌రిగిన ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(Sunrisers Hyderabad) విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ నిర్దేశించిన 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ ఆరు వికెట్ల కోల్పోయి ఆఖ‌రి బంతికి ఛేదించింది

  • 07 May 2023 11:01 PM (IST)

    గ్లెన్ ఫిలిప్స్ ఔట్‌

    దూకుడుగా ఆడుతున్న గ్లెన్ ఫిలిప్స్(25) ఔట్ అయ్యాడు. పేస‌ర్ కుల్‌దీప్ యాద‌వ్ వేసిన 19వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 6,6,6,4 ఫోర్ బాదాడు. ఐదో బంతికి సైతం భారీ షాట్‌కు య‌త్నించి షిమ్రాన్ హెట్మెయర్ చేతికి చిక్కాడు. దీంతో 196 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 198/6. అబ్దుల్ సమద్(0), మార్కో జాన్సెన్(1) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:51 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు

    స‌న్‌రైజ‌ర్స్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో రెండో బంతికి రాహుల్ త్రిపాఠి భారీ షాట్ కొట్ట‌గా య‌శ‌స్వి జైస్వాల్ చ‌క్క‌టి క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ కాగా.. ఐదో బంతికి మార్‌క్ర‌మ్ ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 174 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 174/5. గ్లెన్ ఫిలిప్స్(3), అబ్దుల్ సమద్(0) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:48 PM (IST)

    రాహుల్ త్రిపాఠి ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి(47) భారీ షాట్ కొట్ట‌గా య‌శ‌స్వి జైస్వాల్ చ‌క్క‌టి క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 171 ప‌రుగుల(17.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 07 May 2023 10:46 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    17వ ఓవ‌ర్‌ను ఒబెడ్ మెక్కాయ్ వేయ‌గా 13 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి మార్‌క్ర‌మ్ ఫోర్ బాదాడు. 17 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 171/3. రాహుల్ త్రిపాఠి(47), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(6) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:41 PM (IST)

    క్లాసెన్ ఔట్‌

    16వ ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేయ‌గా 12 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి క్లాసెన్(26) భారీ షాట్ ఆడ‌గా బౌండ‌రీ లైన్ వ‌ద్ద బ‌ట్ల‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 157 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 158/3. రాహుల్ త్రిపాఠి(40), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:35 PM (IST)

    క్లాసెన్ ఫోర్‌

    15వ ఓవ‌ర్‌ను పేస‌ర్ కుల్దీప్ సేన్ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి క్లాసెన్ పోర్ కొట్టాడు. 15 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 146/2. రాహుల్ త్రిపాఠి(39), హెన్రిచ్ క్లాసెన్(16) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:31 PM (IST)

    19 ప‌రుగులు

    14వ ఓవ‌ర్‌ను మురుగన్ అశ్విన్ వేయ‌గా 19 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి బంతికి క్లాసెన్ సిక్స్ కొట్ట‌గా, మూడు, నాలుగో బంతుల‌ను వ‌రుస‌గా రాహుల్ త్రిపాఠి సిక్స్‌, ఫోర్ లుగా మ‌లిచాడు. 14 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 136/2. రాహుల్ త్రిపాఠి(37), హెన్రిచ్ క్లాసెన్(8) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:22 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్‌

    ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అభిషేక్ శ‌ర్మ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఆ మ‌రుస‌టి బంతికే చాహ‌ల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 116 ప‌రుగుల(12.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 117/2. రాహుల్ త్రిపాఠి(24), హెన్రిచ్ క్లాసెన్(1) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:19 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ సిక్స్

    12వ ఓవ‌ర్‌ను మురుగన్ అశ్విన్ వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి అభిషేక్ శ‌ర్మ సిక్స్ కొట్టాడు. 12 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 107/1. అభిషేక్ శర్మ(48), రాహుల్ త్రిపాఠి(24) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:13 PM (IST)

    త్రిపాఠి ఫోర్‌

    11వ ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా 11 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి త్రిపాఠి ఫోర్ కొట్టాడు. 11 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 98/1. అభిషేక్ శర్మ(40), రాహుల్ త్రిపాఠి(23) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:10 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    ప‌దో ఓవ‌ర్‌ను మురుగన్ అశ్విన్ వేయ‌గా 14 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి త్రిపాఠి సిక్స్ కొట్ట‌గా నాలుగో బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ బాదాడు. 10 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 87/1. అభిషేక్ శర్మ(38), రాహుల్ త్రిపాఠి(15) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 10:03 PM (IST)

    8 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను పేస‌ర్ కుల్దీప్ యాద‌వ్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 73/1. అభిషేక్ శర్మ(32), రాహుల్ త్రిపాఠి(7) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:59 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఫోర్‌

    ఎనిమిదో ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేయగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్టాడు. 8 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 65/1. అభిషేక్ శర్మ(25), రాహుల్ త్రిపాఠి(6) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:53 PM (IST)

    6 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 58/1. అభిషేక్ శర్మ(20), రాహుల్ త్రిపాఠి(4) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:51 PM (IST)

    అన్మోల్‌ప్రీత్ సింగ్ ఔట్‌

    ఆరో ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేయ‌గా ఏడు ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి అన్మోల్‌ప్రీత్ సింగ్(33) షిమ్రాన్ హెట్మెయర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 51 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 52/1. అభిషేక్ శర్మ(18), రాహుల్ త్రిపాఠి(1) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:45 PM (IST)

    మూడు ఫోర్లు

    ఐదో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా 15 ప‌రుగులు వ‌చ్చాయి. అన్మోల్‌ప్రీత్ సింగ్ ఒక‌టి, అభిషేక్ శర్మ రెండు ఫోర్లు కొట్టారు. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 45/0. అభిషేక్ శర్మ(18), అన్మోల్‌ప్రీత్ సింగ్(27) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:40 PM (IST)

    అన్మోల్‌ప్రీత్ సింగ్ ఫోర్

    నాలుగో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి అన్మోల్‌ప్రీత్ సింగ్ ఫోర్ కొట్టాడు. 4 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 30/0. అభిషేక్ శర్మ(9), అన్మోల్‌ప్రీత్ సింగ్(21) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:36 PM (IST)

    చెరో ఫోర్‌

    మూడో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ‌ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి అభిషేక్ శ‌ర్మ‌, ఆఖ‌రి బంతికి అన్మోల్‌ప్రీత్ సింగ్ బౌండ‌రీలు బాదారు. 3 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 22/0. అభిషేక్ శర్మ(7), అన్మోల్‌ప్రీత్ సింగ్(15) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:32 PM (IST)

    అన్మోల్‌ప్రీత్ సింగ్ సిక్స్

    రెండో ఓవ‌ర్‌ను పేస‌ర్ కుల్‌దీప్ యాద‌వ్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి అన్మోల్‌ప్రీత్ సింగ్ సిక్స్ కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 12/0. అభిషేక్ శర్మ(2), అన్మోల్‌ప్రీత్ సింగ్(10) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:29 PM (IST)

    4 ప‌రుగులు

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ‌రిలోకి దిగింది. అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. 1 ఓవ‌ర్‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 4/0. అభిషేక్ శర్మ(1), అన్మోల్‌ప్రీత్ సింగ్(3) క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 09:07 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్ ల‌క్ష్యం 215

    ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(95; 59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. బ‌ట్ల‌ర్ తో పాటు సంజు శాంస‌న్‌(66 నాటౌట్; 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్‌(35; 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మార్కో జాన్సెన్ లు చెరో వికెట్ తీశారు.

  • 07 May 2023 09:00 PM (IST)

    సెంచ‌రీకి ఐదు ప‌రుగుల దూరంలో బ‌ట్ల‌ర్ ఔట్

    దూకుడుగా ఆడుతున్న బ‌ట్ల‌ర్ సెంచ‌రీకి ఐదు ప‌రుగుల దూరంలో ఔట్ అయ్యాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ 192 ప‌రుగుల(18.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 197/2. సంజు శాంస‌న్‌(52), షిమ్రాన్ హెట్మెయర్(5) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:55 PM (IST)

    శాంస‌న్ అర్ధ‌శత‌కం

    18వ ఓవ‌ర్‌ను న‌ట‌రాజ‌న్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 5 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి రెండు ప‌రుగులు తీసి 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో సంజు శాంస‌న్ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 190/1. సంజు శాంస‌న్‌(51), జోస్ బట్లర్(94) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:50 PM (IST)

    మూడు ఫోర్లు

    బ‌ట్ల‌ర్‌, శాంస‌న్‌లు దూకుడుగా ఆడుతున్నారు. 17వ ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేయ‌గా 17 ప‌రుగులు వ‌చ్చాయి. బ‌ట్ల‌ర్ మూడు ఫోర్లు బాదాడు. 17 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 185/1. సంజు శాంస‌న్‌(48), జోస్ బట్లర్(92) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:42 PM (IST)

    రెండు సిక్స్‌లు

    16వ‌ ఓవ‌ర్‌ను మ‌యాంక్ మార్కండే వేయ‌గా 14 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతిని బ‌ట్ల‌ర్‌, ఐదో బంతికి శాంస‌న్ సిక్స్‌లు కొట్టారు. 16 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 168/1. సంజు శాంస‌న్‌(47), జోస్ బట్లర్(78) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:38 PM (IST)

    రెండు ఫోర్లు

    15వ ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేయ‌గా 12 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి రెండు బంతుల‌ను బ‌ట్ల‌ర్ ఫోర్లుగా మ‌లిచాడు. 15 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 154/1. సంజు శాంస‌న్‌(40), జోస్ బట్లర్(71) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:33 PM (IST)

    శాంస‌న్‌ సిక్స్‌

    14వ ఓవ‌ర్‌ను మ‌యాంక్ మార్కండే వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి శాంస‌న్‌ సిక్స్ కొట్టాడు. 14 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 142/1. సంజు శాంస‌న్‌(38), జోస్ బట్లర్(61) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:30 PM (IST)

    బ‌ట్ల‌ర్ సిక్స్‌

    13వ ఓవ‌ర్‌ను వివ్రాంత్ శర్మ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి బ‌ట్ల‌ర్ సిక్స్ బాదాడు. 13 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 135/1. సంజు శాంస‌న్‌(32), జోస్ బట్లర్(60) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:25 PM (IST)

    బ‌ట్ల‌ర్ అర్ధ‌శ‌త‌కం

    మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో(11.4వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో బ‌ట్ల‌ర్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 125/1. సంజు శాంస‌న్‌(32), జోస్ బట్లర్(51) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:21 PM (IST)

    బ‌ట్ల‌ర్ ఫోర్‌

    11వ ఓవ‌ర్‌ను వివ్రాంత్ శర్మ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి బ‌ట్ల‌ర్ ఫోర్ కొట్టాడు. 11 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 115/1. సంజు శాంస‌న్‌(30), జోస్ బట్లర్(43) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:19 PM (IST)

    బ‌ట్ల‌ర్ సిక్స్‌, ఫోర్‌

    ప‌దో ఓవ‌ర్‌ను అభిషేక్ శ‌ర్మ వేయ‌గా 12 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగు, ఐదో బంతుల‌ను వ‌రుస‌గా బ‌ట్ల‌ర్ సిక్స్‌, ఫోర్‌గా మలిచాడు. 10 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 107/1. సంజు శాంస‌న్‌(28), జోస్ బట్లర్(37) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:15 PM (IST)

    మూడు సిక్స‌ర్లు

    శాంస‌న్ వేగం పెంచాడు. తొమ్మిదో ఓవ‌ర్ మాయాంక్ మార్కండే వేయ‌గా 21 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి రెండు బంతుల‌ను సంజు శాంస‌న్ ఆఖ‌రి బంతిని బ‌ట్ల‌ర్ సిక్స‌ర్లుగా మలిచారు. 9 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 95/1. సంజు శాంస‌న్‌(27), జోస్ బట్లర్(27) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:10 PM (IST)

    నాలుగు ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను అభిషేక్ శ‌ర్మ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 74/1. సంజు శాంస‌న్‌(13), జోస్ బట్లర్(20) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:06 PM (IST)

    9 ప‌రుగులు

    మ‌యాంక్ మార్కండే ఏడో ఓవ‌ర్‌ను వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి బంతికి శాంస‌న్ ఫోర్ కొట్టాడు. 7 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 70/1. సంజు శాంస‌న్‌(11), జోస్ బట్లర్(18) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 08:02 PM (IST)

    శాంస‌న్ ఫోర్‌

    రాజ‌స్థాన్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను న‌ట‌రాజ‌న్ వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి శాంస‌న్ ఫోర్ కొట్టాడు. 6 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 61/1. సంజు శాంస‌న్‌(6), జోస్ బట్లర్(14) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:57 PM (IST)

    జైస్వాల్ ఔట్‌

    5వ ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేయ‌గా జైస్వాల్(35) వ‌రుస‌గా రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖ‌రి బంతికి న‌ట‌రాజ‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 54 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 54/1. సంజు శాంస‌న్‌(0), జోస్ బట్లర్(13) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:51 PM (IST)

    జైస్వాల్ ఫోర్‌, సిక్స్‌

    4వ ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేయ‌గా 11 ప‌రుగులు వ‌చ్చాయి. రెండు, మూడు బంతుల‌ను వ‌రుస‌గా జైస్వాల్ ఫోర్‌, సిక్స్ బాదాడు. 4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 45/0. యశస్వి జైస్వాల్(27), జోస్ బట్లర్(12) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:46 PM (IST)

    బ‌ట్ల‌ర్ ఫోర్‌

    మూడో ఓవ‌ర్‌ను న‌ట‌రాజ‌న్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి బ‌ట్ల‌ర్ ఫోర్ కొట్టాడు. 3 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 34/0. యశస్వి జైస్వాల్(17), జోస్ బట్లర్(11) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:41 PM (IST)

    ఫోర్‌, సిక్స్‌

    రెండో ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేయ‌గా 17 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి బ‌ట్ల‌ర్ ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి బంతిని జైస్వాల్ సిక్స్‌గా మ‌లిచాడు. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 26/0. యశస్వి జైస్వాల్(16), జోస్ బట్లర్(5) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:34 PM (IST)

    జైస్వాల్ రెండు ఫోర్లు

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. జైస్వాల్ రెండు ఫోర్లు కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు రాజ‌స్థాన్ స్కోరు 9/0. యశస్వి జైస్వాల్(9), జోస్ బట్లర్(0) లు క్రీజులో ఉన్నారు.

  • 07 May 2023 07:09 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

    యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

  • 07 May 2023 07:08 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్

  • 07 May 2023 07:06 PM (IST)

    టాస్ గెలిచిన రాజస్థాన్

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్ కెప్టెన్ సంజు శాంస‌న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ‌డం ఇది రెండోసారి. గ‌త మ్యాచ్‌లో హైద‌రాబాద్‌పై రాజ‌స్థాన్ 72 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రీ ఈ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ ప్ర‌తీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.