IPL 2023 DC Vs SRH ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి

IPL 2023, SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2023, SRH Vs DC

IPL 2023, SRH Vs DC: ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా 34వ మ్యాచ్ హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం (Rajiv Gandhi International Stadium, Hyderabad)లో జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్… సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా జరిగిన 4వ మ్యాచ్ ఇది. ఉప్పల్ లో ఆడిన 4 మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అలాగే, ఈ సీజన్ లో ఇప్పటివరకు హైదరాబాద్ 7 మ్యాచులు ఆడగా రెండింట్లో గెలుపొందింది. ఢిల్లీ 7 మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 24 Apr 2023 11:21 PM (IST)

    హైదరాబాద్ ఓటమి

    145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అత్యల్ప టార్గెట్ ను కూడా చేధించలేక హైదరాబాద్ జట్టు చతికిలపడింది. 7 పరుగుల తేడాతో ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.

  • 24 Apr 2023 11:10 PM (IST)

    6 బంతులు.. 13 పరుగులు

    ఈ మ్యాచ్ లో గెలుపొందాలంటే హైదరాబాద్ జట్టు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది.

  • 24 Apr 2023 11:07 PM (IST)

    6వ వికెట్ డౌన్.. హెన్రిచ్ ఔట్

    హైదరాబాద్ జట్టు 6వ వికెట్ కోల్పోయింది. 18.3 ఓవర్లలో 126 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న హెన్రిచ్(31)ను నోర్జే ఔట్ చేశాడు.

  • 24 Apr 2023 10:58 PM (IST)

    17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోర్ 107/5

    17 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

  • 24 Apr 2023 10:44 PM (IST)

    85 పరుగులకే 5 వికెట్లు డౌన్..

    హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. 85 పరుగుల స్కోర్ వద్ద 5 వికెట్ ను కోల్పోయింది. మార్ క్రమ్ (3) ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.

  • 24 Apr 2023 10:42 PM (IST)

    79 పరుగులకే 4 వికెట్లు డౌన్..

    145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టు స్కోర్ 79 పరుగుల వద్ద హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (5) ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు.

  • 24 Apr 2023 09:52 PM (IST)

    4 ఓవర్లలో 26 పరుగులు

    సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్ 6, మయాంక్ అగర్వాల్ 20 పరుగులతో ఉన్నారు.

  • 24 Apr 2023 09:31 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ షురూ

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ వచ్చారు.

  • 24 Apr 2023 09:15 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 145 పరుగులు

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ 21, ఫిలిప్ సాల్ట్ 0, మిచెల్ మార్ష్ 25, సర్ఫరాజ్ ఖాన్ 10, మనీశ్ పాండే 33, అమన్ ఖాన్ 4, అక్షర్ పటేల్ 34, రిపాల్ పటేల్ 5, అన్రిచ్ 2, కుల్దీప్ యాదవ్ 4 (నాటౌట్), ఇషాంత్ శర్మ 1 (నాటౌట్) పరుగు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ కుమార్ 2, నటరాజన్ 1 వికెట్ తీశారు.

  • 24 Apr 2023 08:44 PM (IST)

    100 దాటిన ఢిల్లీ స్కోరు

    ఢిల్లీ స్కోరు 100 దాటింది. క్రీజులో మనీశ్ పాండే 24, అక్షర్ పటేల్ 19 పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోరు 106/5గా ఉంది.

  • 24 Apr 2023 08:16 PM (IST)

    5 వికెట్లు డౌన్

    ఢిల్లీ క్యాపిటల్స్ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అమన్ ఖాన్ 4 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 9 ఓవర్లకు 69/5గా ఉంది. క్రీజులో మనీశ్ పాండే 4, అక్షర్ పటేల్ 2 పరుగులతో ఉన్నారు.

  • 24 Apr 2023 08:13 PM (IST)

    డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్ ఔట్

    ఢిల్లీ క్యాపిటల్స్  4 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 21, సర్ఫరాజ్ ఖాన్ 10 పరుగులకే ఔటయ్యారు. వారిద్దరి వికెట్లనూ వాషింగ్టన్ సుందర్ తీశాడు.

  • 24 Apr 2023 08:03 PM (IST)

    6 ఓవర్లకు 49/2

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 6 ఓవర్లకు 49/2గా ఉంది. క్రీజులో డేవిడ్ వార్నర్ 15, సర్ఫరాజ్ ఖాన్ 8 పరుగులతో ఉన్నారు.

  • 24 Apr 2023 07:57 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్

    ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ మిచెల్ మార్ష్ ఔట్ అయ్యాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 4.4 ఓవర్ వద్ద ఢిల్లీ ఈ వికెట్ కోల్పోయింది.

  • 24 Apr 2023 07:51 PM (IST)

    4 ఓవర్లకు స్కోరు 35/1

    ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 35/1 (4 ఓవర్లకు)గా ఉంది. డేవిడ్ వార్నర్ 13, మిచెల్ మార్ష్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 24 Apr 2023 07:43 PM (IST)

    2 ఓవర్లకు స్కోరు 21/1

    ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) స్కోరు 21/1 (2 ఓవర్లకు)గా ఉంది. వార్నర్ 1, మిచెల్ మార్ష్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 24 Apr 2023 07:36 PM (IST)

    ఫిలిప్ ఔట్

    తొలి ఓవర్ 3వ బంతికే ఢిల్లీ ఓపెనర్ ఫిలిప్ డకౌట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో హెన్రిచ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 24 Apr 2023 07:31 PM (IST)

    ఓపెనర్లుగా వార్నర్, ఫిలిప్

    ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్ వచ్చారు. తొలి ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేస్తున్నాడు.

  • 24 Apr 2023 07:13 PM (IST)

    డేవిడ్ వార్నర్ సేన

    ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ

  • 24 Apr 2023 07:11 PM (IST)

    మార్క్రామ్ సేన

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

  • 24 Apr 2023 07:02 PM (IST)

    ఢిల్లీ బ్యాటింగ్

    ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • 24 Apr 2023 06:54 PM (IST)

    కాసేపట్లో టాస్

    కాసేపట్లో టాస్ వేయనున్నారు. టాస్ గెలిచే జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.