SRH vs RCB
SRH vs RCB: ఐపీఎల్(IPL) 2023లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆర్‌సీబీకి చాలా ముఖ్యం. ఓడితే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ గెలిచినా, ఓడినా పెద్దగా పోయేది ఏమీ ఉండదు. అయితే సొంతగడ్డపై ఇప్పటికే చాలా మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కనుక ఓడితే చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన ఒక్క స్థానం కోసం బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక వేళ బెంగళూరు విజయం సాధిస్తే మాత్రం ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారనుంది. అప్పుడు చెన్నై, లక్నో, బెంగళూరు, రాజస్థాన్, ముంబై, పంజాబ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్ అయ్యే వరకు ఆగాల్సి ఉంటుంది.
IPL 2023 playoffs: ప్లే ఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చిన లక్నో విజయం
హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 9, సన్‌రైజర్స్ 12 మ్యాచుల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. మరో రికార్డు కూడా బెంగళూరును కలవరపెడుతోంది. బెంగళూరుకు డూ ఆర్ డై సందర్భంలో దాదాపు ప్రతిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన గెలుస్తుందా..? లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అయితే.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఆర్‌సీబీ గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎలాగూ తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేకపోవడంతో కోహ్లి ఉన్న బెంగళూరు నేటి మ్యాచ్‌లో విజయం సాధించాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటుండడం విశేషం. ఉప్పల్‌లో లక్నోతో ఆడిన మ్యాచులో కోహ్లి లేకపోయినా అభిమానులు పెద్ద ఎత్తున అతడికి మద్దతుగా నిలిచి కోహ్లి.. కోహ్లి అంటూ నినాదాలతో హోరెత్తించగా నేటి మ్యాచ్‌లో విరాట్ ఆడుతుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే.
IPL 2023: మహ్మద్ సిరాజ్ ఇంట్లో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ టీం ప్లేయర్లు సందడి.. ఫొటోలు, వీడియో వైరల్
తుది జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫరూఖీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్