IPL 2024 auction : ఐపీఎల్ 2024 వేలం కోసం 333 మంది ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం జాబితాను బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రపంచ కప్ విజేత ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ తోపాటు 333 మంది ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలం ప్రక్రియ కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు....

IPL 2024 auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం జాబితాను బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రపంచ కప్ విజేత ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ తోపాటు 333 మంది ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేలం ప్రక్రియ కోసం మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ సహా 20 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు.

ALSO READ : Onion Price : తగ్గిన ఉల్లి ధరలు…మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10

మరోవైపు హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ అనే ముగ్గురు భారతీయ ఆటగాళ్లు రూ.2కోట్లు ఉన్న జాబిలాతో ఉన్నారు. యువ న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర తన కనీస ధర రూ.50లక్షలని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా తనను తాను రూ. 50 లక్షల బ్రాకెట్‌లో ఉంచుకున్నారు.

ALSO READ : CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2023 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కొద్దిసేపు కనిపించిన తర్వాత ఐపిఎల్ వేలం నుంచి తన పేరును తొలగించారు. ఈ నెల 19వతేదీన ఐపీఎల్ వేలం జరగనుంది. వేలంలో ఖర్చు పెట్టడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీల వద్ద రూ. 262.95 కోట్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు