విశాఖలో ఐపీఎల్ సందడి.. ఐదేళ్ల తర్వాత విశాఖ వేదికగా మ్యాచ్! స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు.

Chennai Super Kings

IPL 2024 : విశాఖ పట్టణంలో ఐపీఎల్ కోలాహలం నెలకొంది. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లకోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖను సొంత వేదికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. చివరి సారిగా ఈ స్టేడియంలో 2019 మేలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లోనూ చెన్నై వర్సెస్ ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఐదేళ్ల తరువాత విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండటంతో విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్దకు అభిమానుల కోలాహలం నెలకొంది.

Also Read : IPL 2024 సీజ‌న్‌లో అత్యంత వేగవంతమైన బంతి.. బ్యాట్ పైకెత్తేలోపు దూసుకెళ్లింది..! వీడియో వైరల్

ఐపీఎల్ లో భాగంగా విశాఖ స్టేడియంలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు జరిగాయి. 2012, 2015, 2016, 2019 సంవత్సరాల్లో మ్యాచ్ లు జరిగాయి. 2024 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. రెండింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు రెండు మ్యాచ్ లు ఆడి రెండింటిలోనూ ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లలో సీఎస్కే జట్టు పేవరెంట్ అని చెప్పొచ్చు. ధోనీని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియంకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్ద అభిమానుల సందడి మొదలు కావటంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

Also Read : IPL 2024 : మయాంక్ యాదవ్ బౌలింగ్ పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. మ్యాచ్ తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాల్లో ప్రయాణించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. మరోవైపు.. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ కు 28వేల మంది వీక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు తగ్గట్లుగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు