IPL 2024 : లక్నోపై ఢిల్లీ విజయం.. ప్లేఆఫ్‌కు చేరుకున్న రాజస్థాన్..!

కోల్ కతా, రాజస్థాన్ జట్ల ప్లేఆఫ్ కు చేరుకోవటంతో మూడు, నాలుగు బెర్తులకోసం సాంకేతికంగా అయిదు జట్లు పోటీ ఉన్నా..

IPL 2024 (Credit _ Twitter)

IPL 2024 DC vs LSG : ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విజయంతో రాజస్థాన్ జట్టు ఫేఆఫ్ కు చేరుకుంది. ఇప్పటికే కోల్ కతా జట్టు 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకున్న తొలి జట్టుగా కోల్ కత్తా నిలిచింది. రెండో స్థానంలో రాజస్థాన్ జట్టు 16 పాయింట్లతో ఉంది. అయితే, లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు ముగిశాక మరో రెండు కంటే ఎక్కువ జట్లు రాజస్థాన్ ను అందుకునే అవకాశం లేకపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంది.

Also Read :  IPL 2024 DC vs LSG : కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

కోల్ కతా, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్ కు చేరుకోవడంతో మూడు, నాలుగు బెర్తులకోసం సాంకేతికంగా అయిదు జట్లు పోటీ ఉన్నా.. ప్రధానంగా మెరుగైన రన్ రేట్ కలిగినఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయినట్లేనని చెప్పొచ్చు. లీగ్ దశలో ఢిల్లీ 14 మ్యాచ్ లు పూర్తిచేసుకుంది. ఏడు మ్యాచ్ లలో మాత్రమే ఆ జట్టు గెలిచి 14 పాయింట్లతో ఉంది. అయితే, ఢిల్లీ జట్టు రన్ రేటు తక్కువగా -0.377 గా ఉంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు జట్లలో రెండు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read : ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి.. హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధానంగా మెరుగైన రన్ రేట్ కలిగిఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు జట్లలో ఏ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. 16న గుజరాత్ పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పటికీ మరో అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచ్ లలో 14 పాయింట్లతో ఉంది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లో విజయం సాధించినా హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే. ఇక ఈనెల 18న బెంగళూరు వర్సెస్ చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒకవేళ చెన్నై జట్టుపై బెంగళూరు ఘన విజయం సాధిస్తే ఫ్లేఆఫ్స్ కు చేరు అవకాశం ఉంటుంది

 

 

ట్రెండింగ్ వార్తలు