IPL 2024 mini auction to be held in Dubai on December 19
IPL 2024 mini Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మరో సీజన్‌కు రెడీ అవుతోంది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం కానుంది. 2024 సీజన్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ-వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు (BCCI) డిసెంబర్ 3న (ఆదివారం) ధృవీకరించింది. అయితే, విదేశాలలో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే మొదటిసారి. మొత్తం 1166 మంది ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఈ వేలంలో ఆసీస్ వరల్డ్ కప్ ఆటగాళ్లతో పాటు 3 టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి ఏడుగురు ఆటగాళ్లు ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు వేలంలో తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు చివరి మినీ వేలం ఇదేనని పిటిఐ తెలిపింది. మొత్తం 77 స్లాట్లు ఉండగా.. వాటిలో 30 విదేశీ ఆటగాళ్లు, 10 జట్లు కలిపి మొత్తంగా రూ.262.95 కోట్లను వెచ్చించే అవకాశం ఉంది.
Read Also : Team India : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలను ప్రశ్నించిన బీసీసీఐ..!
అయితే, ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్‌లతో సహా ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా స్టార్లు వేలంలో పాల్గొంటారని నివేదిక పేర్కొంది. వీరిలో ముగ్గురూ తమ బేస్ ధరను రూ. 2 కోట్లగా నిర్ణయించగా, న్యూజిలాండ్‌కు చెందిన అత్యధిక రేటింగ్ కలిగిన యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర రూ. 50 కోట్ల బేస్ ధర పలుకుతున్నాడు.
ప్రపంచ కప్ 2023లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర.. 10 మ్యాచ్‌లలో 543 పరుగులు, 5 వికెట్లు తీయడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను షేర్ చేయనుంది.
??? ???? ??????? ?
?️ 19th December
? ????? ?
ARE. YOU. READY ❓ #IPLAuction | #IPL pic.twitter.com/TmmqDNObKR
— IndianPremierLeague (@IPL) December 3, 2023
ఐపీఎల్ 2024 జట్ల పూర్తి జాబితా ఇదే :
ప్రాంచైజీలు తమ జట్లలోని ఆటగాళ్లను ప్రకటిస్తున్నాయి. మినీ వేలానికి ఒక వారం ముందు డిసెంబర్ 12న ట్రేడ్ విండో ముగియనుంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ఫలితంగా.. ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రేడింగ్ చేసింది.
నవంబర్ 26న చివరి రోజున జట్లు మొత్తం 173 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. దాంతో గుజరాత్ టైటాన్స్ గరిష్టంగా రూ. 38.15 కోట్లతో వేలానికి వెళ్లనుండగా, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 31.4 కోట్లు, రూ. 28.95 కోట్లతో వేలానికి వెళ్లనున్నాయి. నివేదికల ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను నిర్ధారించిన తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.
ఫ్రాంచైజీ మిగిలిన మొత్తం మిగిలిన ఖాళీలు మిగిలిన ఓవర్సీస్ ఖాళీలు
సీఎస్‌కె రూ.31.40 కోట్లు 6 3
డీసీ రూ.28.95 కోట్లు 9 4
జీటీ రూ.38.15 కోట్లు 8 2
కెకెఆర్ రూ.32.70 కోట్లు 12 4
ఎల్ఎస్‌జీ రూ.13.15 కోట్లు 6 2
ఎంఐ రూ.17.75 కోట్లు 8 4
బీకెఎస్ రూ.29.10 కోట్లు 8 2
ఆర్‌సీబీ రూ.23.25 కోట్లు 6 3
ఆర్ఆర్ రూ.14.50 కోట్లు 8 3
ఎస్ఆర్‌హెచ్ రూ. 34.00 కోట్లు 6 3
Read Also : WTC Points Table : బిగ్ షాక్.. టీమ్ఇండియాను వెనక్కి నెట్టిన బంగ్లాదేశ్