IPL 2024 most unlucky captain Ruturaj Gaikwad loses 7th toss in 8 matches
Ruturaj Gaikwad : కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన చెన్నై నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేస్తోంది.
కాగా.. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. నేటి మ్యాచ్‌తో కలిపి అతడు ఎనిమిది మ్యాచ్‌లో టాస్ వేయగా కేవలం ఒక్కసారే టాస్ గెలిచాడు. మిగిలిన ఏడు సందర్భాల్లోనూ అతడు టాస్ ఓడిపోయింది. క్రికెట్‌లో కొన్ని సందర్భాల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్‌లో టాస్ కీలకమవుతుండడాన్ని చూస్తూనే ఉన్నాం.
Irfan Pathan : ఇంకా కొందరు ముంబై ప్లేయర్లు రోహితే కెప్టెన్ అని భావిస్తున్నారు : ఇర్ఫాన్ పఠాన్
కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రమే రుతురాజ్ టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడం విశేషం. అతడు టాస్ ఓడిపోయినప్పటికీ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ పై చెన్నై విజయాలు సాధించింది. కాగా.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచాడు. ఆరు సందర్భాల్లో టాస్ ఓడిపోయాడు.
ఐపీఎల్ 2024లో రుతురాజ్ గైక్వాడ్ టాస్ రికార్డు..
ప్రత్యర్థి | టాస్ ఫలితం | మ్యాచ్ ఫలితం |
---|---|---|
RCB | ఓటమి | గెలుపు |
GT | ఓటమి | గెలుపు |
DC | ఓటమి | ఓటమి |
SRH | ఓటమి | ఓటమి |
KKR | గెలుపు | గెలుపు |
MI | ఓటమి | గెలుపు |
LSG | ఓటమి | ఓటమి |
LSG | ఓటమి | – |