హైదరాబాద్ బోణీ.. ముంబైపై గ్రాండ్ విక్టరీ

క్లాసెన్ 80 పరుగులు బాదాడు. మిగతా బ్యాటర్లూ రాణించడంతో భారీ స్కోరు నమోదైంది.

చెలరేగిన హైదరాబాద్.. ముంబైపై ఘన విజయం
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. 31 రన్స్ తేడాతో ముంబైపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ముంబై జట్టు 246 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు క్లాసెన్(80), హెడ్ (62), అభిషేక్ (63) చెలరేగిపోయారు. ముంబైలో తిలక్ వర్మ(64) ఒంటరి పోరాటం చేశాడు.

ముంబై ఇండియన్స్ టార్గెట్ 278 రన్స్
ముంబై ఇండియన్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 11, ట్రావిస్ హెడ్ 62, అభిషేక్ శర్మ 63, మార్క్రమ్ 42, క్లాసెన్ 80 పరుగులు బాదారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా, గెరాల్డ్, పీయూష్ చావ్లాకు తలో వికెట్ చొప్పున దక్కాయి.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీర బాదుడు
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ చెలరేగడంతో స‌న్‌రైజ‌ర్స్ స్కోరు పరుగులు పెట్టింది. 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు.

 

మయాంక్ అవుట్, ఫస్ట్ వికెట్ డౌన్
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్
IPL 2024 SRH vs MI: టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. ముంబై జట్టులో ఒక మార్పు జరిగింది. లూక్ స్థానంలో మాఫాకా జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. జాన్సెన్, నటరాజన్‌ స్థానంలో హెడ్, ఉనద్కత్ జట్టులోకి వచ్చారు.

తుది జట్లు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

ముంబై ఇండియ‌న్స్
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా

రోహిత్ శర్మకు స్పెషల్ మ్యాచ్
ఈ రోజు మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా స్పెషల్. ఉప్పల్ స్టేడియంలో హిట్ మాన్ 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ప్రత్యేక స్మారక జెర్సీని రోహిత్ శర్మకు బహుకరించారు. సహచర జట్టు సభ్యులు రోహిత్ శర్మను అభినందించారు. కాగా, విరాట్ కోహ్లి(239), ఎంఎస్ ధోని(222) రోహిత్ కంటే ముందున్నారు.

 

ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ లవర్స్ సందడి
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ లవర్స్ సందడి నెలకొంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతిస్తుండడంతో అభిమానులు బారులు తీరారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. టికెట్లు పరిశీలించిన తర్వాత ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ సజావుగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీఎస్ ఆర్టీసీ, మెట్రోరైళ్లు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.

జోరుగా బ్లాక్ టికెట్ల దందా
ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాంప్లెమెంటరీ పాసులను బ్లాక్‌లో అమ్ముతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు HCA నుంచి టిక్కెట్లు పక్కదారి పట్టాయని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా రోహిత్ శర్మ 
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూశాయి. ఈరోజు మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని రెండు టీమ్‌లు పట్టుదలతో ఉన్నాయి. ముంబై టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడి ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు