WI vs ZIM : వాంఖడే వేదికగా జింబాబ్వే, వెస్టిండీస్‌ల మధ్య కీలక మ్యాచ్.. మరో సంచలనం ఖాయమేనా! హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్, జింబాబ్వే జట్ల (WI vs ZIM ) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2026 WI vs ZIM match today head to head records
WI vs ZIM : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్-8లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో నేటి మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా, శ్రీలంకకు గ్రూప్ దశలో షాకిచ్చింది జింబాబ్వే. ఈ క్రమంలో విధ్వంకర వీరులకు పెట్టింది పేరైన వెస్టిండీస్‌పై ఎలా ఆడుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ సికిందర్ రజా, ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్, బ్రాడ్ ఈవాన్స్ మంచి ఫామ్‌లో ఉండడం జింబాబ్వేకు కలిసి వచ్చే అంశం. వీరిందరూ మరోసారి రాణిస్తే విండీస్‌కు షాక్ తప్పదు. పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ మంచి లయలో ఉన్నాడు. అతడు విండీస్ బ్యాటర్లకు ఎలా అడ్డుకుంటాడో అన్న దానిపై జింబాబ్వే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరోవైపు షై హోప్, హెట్‌మయ్యర్, జేసన్ హోల్డర్, షమార్ జోసఫ్, రొమారియో షెఫర్డ్ వంటి ఆటగాళ్లతో విండీస్ బలంగా కనిపిస్తోంది.
హెడ్-టు-హెడ్..
జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు ఇప్పటి వరకు 4 టీ20ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్ 2026కి స్క్వాడ్లు ఇవే..
వెస్టిండీస్..
బ్రాండన్ కింగ్, షై హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్.
జింబాబ్వే..
సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరవ, బ్రెండన్ టేలర్.
