IPL 2025: వాటే మ్యాచ్..! లక్నోపై ఢిల్లీ సంచలన విజయం.. చెలరేగిన శర్మ..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

Courtesy BCCI

IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ సంచలన విజయం సాధించింది. వికెట్ తేడాతో లక్నోని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసింది. 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

Also Read : CSK బాల్ ట్యాంపరింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికారంటూ వీడియో వైరల్..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే బిగ్ షాక్స్ తగిలాయి. 1.4 ఓవర్లలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న స్థితిలో విప్రాజ్ నిగమ్, అశుతోశ్ లు చెలరేగి ఆడారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి వీర బాదుడుతో కొండంత లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. అశుతోశ్ శర్మ చివరి వరకు ఉండి జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.