IPL 2025: మిచెల్ మార్ష్ విధ్వంసం… 235 పరుగులు బాదిన లక్నో సూపర్ జెయింట్స్

లక్నో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు.

Pic: @IPL (X)

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాల మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ మొదటి నుంచి ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. పవర్‌ప్లేలో లక్నో 53-0 స్కోరుతో లక్నో దూసుకెళ్లింది. మార్క్రమ్ అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఐడెన్ మార్క్రమ్ 36 పరుగులు చేశాడు.

ఇక మిచెల్ మార్ష్ మరింత ధాటిగా ఆడి 117 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 56, రిషబ్ పంత్ 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

లక్నో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు. సాయి కిశోర్, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

గుజరాత్ జట్టు
శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కే