IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ఢిల్లీపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 205 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 14 రన్స్ తేడాతో కేకేఆర్ విక్టరీ కొట్టింది.

ఢిల్లీ బ్యాటర్లలో డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 43 పరుగులు, విప్రాజ్ నిగమ్ 38 రన్స్ కొట్టారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీశాడు.

Also Read: వైభ‌వ్ సూర్య‌వంశీకి థ్యాంక్స్ చెప్పిన‌ ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా.. ఓరి నాయ‌నో దాని వెనుక ఇంత స్టోరీ ఉందా..