Vaibhav Suryavanshi-Sanjiv Goenka : వైభవ్ సూర్యవంశీకి థ్యాంక్స్ చెప్పిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా.. ఓరి నాయనో దాని వెనుక ఇంత స్టోరీ ఉందా..
సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీకి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా థ్యాంక్స్ చెప్పాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఆర్ఆర్ విజయంలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు.
35 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో బిహార్‌కు చెందిన ఈ కుర్రాడిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా.. వైభవ్ కు 6 ఏళ్ల ఉన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వైభవ్ రైజింగ్ పూణె జెయింట్స్‌ను మద్దుతు ఇస్తున్నట్లుగా ఉంది.
Last night I watched in awe… this morning I came across this photo of 6-year-old Vaibhav Suryavanshi cheering for my then team, Rising Pune Supergiant, in 2017.
Thanks Vaibhav. Lots of good wishes and support. pic.twitter.com/hlS5ieiB4O
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 29, 2025
ఇందుకు సంబంధించిన ఫోటోను లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నిన్న రాత్రి అద్భుతమైన ప్రదర్శన చూశాను. ఈ రోజు ఉదయం 2017లో 6 ఏళ్ల వయసు ఉన్న వైభవ్ సూర్యవంశీ అప్పటి నా జట్టుకు మద్దతు ఇస్తున్న ఫోటోను చూశాను. ధన్యవాదాలు వైభవ్. నీకు అంతా మంచే జరగాలి.’ అని గోయెంకా రాసుకొచ్చాడు.
ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేదం విధించారు. ఆ సమయంలో ఈ రెండు జట్ల స్థానాల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లైయన్స్ జట్లు రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడాయి. ఇందులో రైణింగ్ పూణే జట్టుకు ప్రస్తుత లక్నో యజమాని అయిన సంజీవ్ గొయెంకా ఓనర్.
కాగా.. ప్రస్తుతం సంజీవ్ గొయెంకా షేర్ చేసిన ఫోటోని, ఈ సీజన్‌లో లక్నోతో మ్యాచ్ అనంతరం వైభవ్‌ను అభినందిస్తున్న ఫోటోని పోస్ట్ చేస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. రూ.27 కోట్లు పెట్టి పంత్ తీసుకునే బదలు రూ.2కోట్లు పెట్టి వైభవ్‌ను తీసుకుంటే సరిపోయేదని అంటున్నారు.