IPL 2025 Rohit Sharma and 3 others to be retained by Mumbai Indians
IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనుంది బీసీసీఐ. నవంబర్ ఆఖరి వారంలో వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ప్రకటించిన బీసీసీఐ ప్రతి ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఇచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్, ఇద్దరు అన్ క్యాప్‌డ్ ఆటగాళ్లు ఉండాలని తెలిపింది. ఇక అన్ని జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31 వరకు ప్రకటించాల్సి ఉంది.
దీంతో అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్షన్ జాబితాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఓ జాతీయ ఛానెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రోహిత్ శర్మతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసుకోనున్నట్లు తెలిపింది.
కాగా.. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడం పై రోహిత్ శర్మ అసంతృప్తితో ఉన్నాడని, జట్టును వీడుతాడు అనే ప్రచారం జరిగింది. అయితే.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ముంబై తన మాజీ కెప్టెన్ రోహిత్‌ను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఈ నలుగురి కోసం ముంబై రూ.61 కోట్లు వెచ్చించనుంది. మరో 59 కోట్లతోనే ముంబై వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఇక టీమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలను వేలం ద్వారా తిరిగి సొంతం చేసుకోవాలని ముంబై భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli : 8 ఏళ్ల తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ.. మరోసారి విఫలం..