Courtesy BCCI
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సోమవారం పెను విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అతి తక్కువ వయసులోనే వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కాగా.. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓకే ఓవర్ 30 పరుగులు..
అఫ్గానిస్థాన్ ఆటగాడు కరీమ్ జనత్ ఈ మ్యాచ్ ద్వారానే ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. అయితే.. వైభవ్ సూర్యవంశీ కారణంగా ఆ ఆనందం అతడికి లేకుండా పోయింది. కరీమ్ వేసిన ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు.
14 YEAR OLD VAIBHAV SURYAVANSHI SMASHED 6,4,6,4,4,6 – 30 RUNS IN A SINGLE OVER. 🤯 pic.twitter.com/bEoDhjxXOg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2025
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో పదో ఓవర్‌ను గుజరాత్ బౌలర్ కరీమ్ వేశాడు. ఈ ఓవర్‌లో సూర్య వంశీ చెలరేగి ఆడాడు. 6, 4, 6, 4, 4, 6 బాదేసి 30 పరుగులను పిండుకున్నాడు. కరీమ్ వేసి ప్రతి బంతికి బౌండరీ కొట్టాడు. ఐపీఎల్‌లో కరీమ్‌కు ఇదే తొలి ఓవర్ కావడం గమనార్హం. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు ఇవ్వడంతో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతడికి మరో ఓవర్ ఇవ్వలేదు.
గుజరాత్ టైటాన్స్ తన తదుపరి మ్యాచ్‌ను మే 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కరీమ్‌కు తుది జట్టులో చోటు ఉంటుందో ఉండదో చూడాల్సిందే. సూర్యవంశీ దెబ్బకు ఈ సీజన్‌లో కరీమ్‌కు రాజస్థాన్‌తో మ్యాచ్ మొదటిది, ఆఖరిది అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.