IPL 2025: వావ్‌.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా.. వేగంగా దూసుకొచ్చి.. వీడియో వైరల్

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ప్లేయర్ హర్షల్ పటేల్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

Harshal Patel takes stunning catch (Courtesy BCCI)

IPL 2025: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు బోణీ కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో SRH vs LSG జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జెయింట్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులుచేసి విజయం సాధించింది.

Also Read: IPL 2025: SRH vs LSG మ్యాచ్.. కోపంతో హెల్మెంట్ విసిరికొట్టిన నితీశ్ రెడ్డి.. వీడియో వైరల్

ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హర్షల్ పటేల్ అద్భుత క్యాచ్ పట్టి ఆయుష్ బడోనిని పెవిలియన్ బాటపట్టించాడు. స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్ చివరి బంతికి ఆయుష్ బడోని భారీ షాట్ కొట్టాడు. కానీ, బంతి బ్యాట్ కు సరిగా తగలకపోవటంతో గాల్లోకి ఎగిరి ఫీల్డర్ లేని ప్రదేశంలో పడేలా అనిపించింది. కానీ, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న హర్షల్ పటేల్ వేగంగా దూసుకొచ్చి డ్రైవ్ చేసి అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 


హర్షల్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్ ను చూసి క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అప్పటికే పటిష్ట స్థితిలో ఉంది. విజయం దిశగా దూసుకెళ్తుంది. బడోని ఔట్ అయిన సమయానికి 13 ఓవర్లలో లక్నో జట్టు 154/4 పరుగులతో ఉంది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు లక్నో జట్టును విజయతీరాలకు చేర్చారు.