IPL 2025: అయ్యో.. కొంపముంచావ్ కదయ్యా పాటిదార్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

ఢిల్లీ తన విజయపరంపరను కొనసాగించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై విజయం సాధించింది.

Rajat Patidar KL Rahul (Credit BCCI)

IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ ఢిల్లీ తన విజయపరంపరను కొనసాగించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టుపై విజయం సాధించింది.

Also Read: IPL 2025 : ఎదురులేని ఢిల్లీ.. బెంగళూరుపై విజయం.. వరుసగా నాలుగో గెలుపు

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్ కారణంగా విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 17.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు 164 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐపీఎల్ -2025లో ఇప్పటి వరకు ఢిల్లీ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడగా.. నాలుగు మ్యాచ్ లలోనూ విజయం సాధించింది.

Also Read: GT vs RR : గుజ‌రాత్ పై ఓట‌మి.. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌కు బీసీసీఐ బిగ్ షాక్‌.. వార్నీ ఒక్క‌డికే కాదు జ‌ట్టు స‌భ్యులంద‌రికి.. ఎందుకో తెలుసా?

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కేఎల్ రాహుల్ క్యాచ్ ను డ్రాప్ చేసి పెద్దపొరపాటు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉండుంటే ఆర్సీబీ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉండేవి. నాలుగో ఓవర్ ను యష్ దయాల్ వేశాడు. అప్పటికే ఢిల్లీ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. దయాల్ వేసిన ఓవర్లో రెండో బంతిని కేఎల్ రాహుల్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బాల్ గాల్లోకి లేచింది.. రజత్ పాటిదార్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్ ను క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. డ్రైవ్ చేసి బాల్ ను అందుకొనే ప్రయత్నం చేయగా.. బాల్ చేతిలోపడి మిస్ అయింది. ఈ అవకాశాన్ని కేఎల్ రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.


ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ క్యాచ్ మిస్ చేయడంతో విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయ్యో పాటిదార్ ఎంత పనిచేశావయ్యా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.