IPL 2025 : ఎదురులేని ఢిల్లీ.. బెంగళూరుపై విజయం.. వరుసగా నాలుగో గెలుపు

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

IPL 2025 : ఎదురులేని ఢిల్లీ.. బెంగళూరుపై విజయం.. వరుసగా నాలుగో గెలుపు

Courtesy BCCI

Updated On : April 10, 2025 / 11:09 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ కి తిరుగు లేదు. ఢిల్లీ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. తాజాగా మరో విక్టరీ కొట్టింది. బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఢిల్లీ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

164 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ అలవోకగా చేజ్ చేసింది. 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుని గెలిపించాడు. రాహుల్ 53 బంతుల్లో 93 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి.

Also Read : చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులోకి పృథ్వీ షా..? ఈ ముగ్గురిలో రుతురాజ్ ప్లేస్‌ను రీప్లేస్ చేసేదెవరు..

అటు ట్రిస్టన్ స్టబ్స్ కూడా రాణించాడు. 23 బంతుల్లో 38 పరుగులతో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రాహుల్ గట్టెక్కించాడు. అద్భుతమైన ఆటతీరుతో జట్టుని విజయతీరాలకు చేర్చాడు.

ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. ఆ జట్టుకి ఇది వరుసగా నాలుగో విజయం. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా అన్నింటిలో గెలుపొందింది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరుకి బ్రేక్ వేసింది ఢిల్లీ. ఈ సీజన్ లో ఇప్పటివరు 5 మ్యాచులు ఆడిన ఆర్సీబీ రెండింటిలో ఓటమిపాలైంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది ఢిల్లీ. ఆ తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది.