CSK : చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులోకి పృథ్వీ షా..? ఈ ముగ్గురిలో రుతురాజ్ ప్లేస్‌ను రీప్లేస్ చేసేదెవరు..

టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి వేగంగా పరుగులు చేసే ప్లేయర్ అవసరం.

CSK : చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులోకి పృథ్వీ షా..? ఈ ముగ్గురిలో రుతురాజ్ ప్లేస్‌ను రీప్లేస్ చేసేదెవరు..

Courtesy BCCI

Updated On : April 10, 2025 / 9:39 PM IST

CSK : ఐపీఎల్ 2025 సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాజ్.. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో అతడి ఎల్బోకి గాయమైంది. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ ఆడాడు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో రుతురాజ్ తప్పుకున్నాడు.

ఈ సీజన్ మొత్తం అతడు ఆడటం లేదు. ఇదే సమయంలో ఎంఎస్ ధోని మళ్లీ చెన్నై కెప్టెన్ అయ్యాడు. రుతురాజ్ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు ధోనికి అప్పగించారు. చెన్నై జట్టు నుంచి రుతురాజ్ దూరమయ్యాడు. మరి అతడి స్థానంలో జట్టులోకి వచ్చే ప్లేయర్ ఎవరు? అనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది. ఈ క్రమంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ముగ్గురిలో ఒకరు రుతురాజ్ ను రీప్లేస్ చేయొచ్చని తెలుస్తోంది.

1) పృథ్వీ షా..
రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి నెంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అవసరం. ఆ రకంగా చూసుకుంటే పృథ్వీ షా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. టాప్ లో వేగంగా పరుగులు చేసే బ్యాటర్ కోసం చెన్నై జట్టు చూస్తోంది. ఈ క్రమంలో పృథ్వీ షా వైపు చూస్తున్నారు. టాప్ లో బ్యాటింగ్ కు వచ్చి వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం రైట్ హ్యాండ్ బ్యాటర్ పృథ్వీ షాకు ఉంది. ఆక్షన్ లో అతడు అన్ సోల్డ్ గా ఉండిపోయాడు. అయితే, పృథ్వీ షా ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ధోని కెప్టెన్సీలో అతడు ఆ సమస్యను అధిగమించగలడని చెబుతున్నారు.

Also Read : 180 ఫ్ల‌స్ ల‌క్ష్య‌మా.. అబ్బే మా వ‌ల్ల కాదు.. గ‌త కొన్నేళ్లుగా చెన్నైది ఇదే క‌థ‌.. రైనా ఎంత ప‌ని చేసావ‌య్యా..

ఐపీఎల్ 2024 నుంచి టీ 20 టోర్నమెంట్లలో షా గణాంకాలు..

SMAT 2024 టోర్నమెంట్ : 9 ఇన్నింగ్స్-197 పరుగులు- యావరేజ్ 21.89 స్ట్రైక్ రేట్-156.35
ఇంగ్లండ్ వన్డే కప్ 2024 : 8 ఇన్నింగ్స్ – 343 పరుగులు – యావరేజ్ 42.88 స్ట్రైక్ రేట్ – 117.87 హాఫ్ సెంచరీలు-3
ఐపీఎల్ 2024 : 8 ఇన్నింగ్స్ – 194 పరుగులు – యావరేజ్ 24.75 స్ట్రైక్ రేట్ – 163.64 హాఫ్ సెంచరీ-01

2) ఆయుశ్ మాత్రే
రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో భారత వర్ధమాన క్రికెటర్ ఆయుష్ మాత్రే మరో బలమైన పోటీదారుడు. ఇటీవల, మెన్ ఇన్ ఎల్లో జట్టు కూడా సీజన్ మధ్యలో ట్రయల్స్ కోసం మాత్రేని పిలిచి ఈ అవకాశం గురించి సూచనప్రాయంగా చెప్పింది. 17 ఏళ్ల ఈ యువకుడు IPL 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ సీజన్ మధ్యలో ట్రయల్స్ కోసం పిలువబడ్డాడు. ఇది చాలా అరుదైన చర్య.

మాత్రే గణాంకాలు ఇలా..

నవీ ముంబై టీ 2025 టోర్నమెంట్ : 3 ఇన్నింగ్స్ – 66 పరుగులు – యావరేజ్ 22 – స్ట్రైక్ రేట్ 183
VHT 2024-25 : 7 ఇన్నింగ్స్ – 458 రన్స్ – యావరేజ్ 65.43 – స్ట్రైక్ రేట్ 135.50 – హాఫ్ సెంచరీ -1 సెంచరీలు -2
U-19 Asia Cup 2024 : 5 ఇన్నింగ్స్ – 176 పరుగులు – యావరేజ్ 44 – స్ట్రైక్ రేట్ – 135 హాఫ్ సెంచరీ -1

Also Read : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని..

3) డెవాల్డ్ బ్రెవిస్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక విదేశీ స్థానం మిగిలి ఉంది. గైవ్కాడ్ స్థానంలో ఒక విదేశీ స్టార్‌ను కూడా ఉంచగలడని గమనించాలి. అందువల్ల, డెవాల్డ్ బ్రెవిస్ మెన్ ఇన్ ఎల్లో జట్టుకు ఉత్తమ ఎంపికలలో ఒకటి. గతంలో MI తరపున ఆడిన బ్రెవిస్, SA20 2025లో గొప్పగా రాణించాడు. మిగిలిన సీజన్ కోసం CSK అతడిని పరిగణించవచ్చు.

డెవాల్డ్ బ్రెవిస్ గణాంకాలు..

CSA DIV-1 2025 టోర్నమెంట్ : 7 ఇన్నింగ్స్ – 398 పరుగులు – యావరేజ్ 66.33 – స్ట్రైక్ రేట్ 156.08 – హాఫ్ సెంచరీలు 3 – సెంచరీ 01
SA20 2025 : 10 ఇన్నింగ్స్ – 291 రన్స్ – యావరేజ్ 48.50 – స్ట్రైక్ రేట్ 184.18 – హాఫ్ సెంచరీలు 02
Abu Dhabi T10 : 5 ఇన్నింగ్స్ – 67 రన్స్ – యావరేజ్ 13.40 – స్ట్రైక్ రేట్ 142.55