×
Ad

IPL 2026 Auction : ఫసా ఫసా లేపేశారు.. ఐపీఎల్ వేలం నుంచి 1005 మంది ఔట్.. ఎందుకంటే..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Auction) డిసెంబ‌ర్ 16న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

IPL 2026 Auction BCCI Removes 1005 Players From List

IPL 2026 Auction : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం డిసెంబ‌ర్ 16న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేలం కోసం న‌మోదు చేసుకున్న ప్లేయ‌ర్ల జాబితా నుంచి 1005 మంది ఆట‌గాళ్ల పేర్ల‌ను బీసీసీఐ తొల‌గించింది. అదే స‌మ‌యంలో కొత్త‌గా 35 మంది ప్లేయ‌ర్ల పేర్ల‌ను చేర్చింది. ఫ్రాంఛైజీల‌ ఆస‌క్తి మేర‌కు మొత్తంగా 350 మందితో షార్ట్ లిస్ట్‌ను రెడీ చేసింది.

ద‌క్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ తొలుత త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకోలేదు. దీంతో తొలుత ప్ర‌క‌టించిన లిస్ట్‌లో అత‌డి పేరు లేదు. అయితే.. ఆఖ‌రి నిమిషంలో త‌న మ‌న‌సును మార్చుకుని రిజిస్ట‌ర్ చేసుకున్నాడు. అంతేకాదండోయ్ అత‌డు త‌న బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్ల నుంచి కోటికి త‌గ్గించుకున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది.

ఫ్రాంఛైజీల అభ్య‌ర్థ మేరకు అత‌డితో పాటు మిగిలిన వారిని షార్ట్ లిస్ట్‌లో చేర్చారు. ఈ 35 మంది ఆట‌గాళ్ల‌లో శ్రీలంక‌, ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌తో పాటు టీమ్ఇండియా దేశ‌వాళీ క్రికెట్ల‌రు కూడా ఉన్నారు.

Pakistan : 2025లో పాక్‌లో అత్య‌ధికంగా భార‌త ఆట‌గాడి కోసం సెర్చ్ చేశారా? విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ కాదా..

నివేదిక ప్ర‌కారం.. వేలం క్యాప్‌డ్ ఆట‌గాళ్ల‌తో ప్రారంభం అవుతుంది. తొలుత బ్యాట‌ర్లు, ఆ త‌రువాత ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే క్ర‌మంలో వేలం జ‌ర‌గుతుంది. ఆ త‌రువాత అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లలో ఇదే క్ర‌మం అనుస‌రించ‌బ‌డుతుంది.

ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లు వీరే..

విదేశీ ఆటగాళ్లు వీరే..

అరబ్ గుల్ (అఫ్గానిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లాండ్), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్‌హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).

IND vs SA : సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌.. కెరీర్ మైల్‌స్టోన్ పై సంజూ శాంస‌న్ క‌న్ను..

భారత ఆటగాళ్లు వీరే..

సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్‌రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్‌సారే, యష్ డిచోల్కర్, అయాజ్‌క్ వల్కర్, ధుర్‌మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.