2025లో పాకిస్తాన్ వాళ్లు పిచ్చి పిచ్చిగా వెతికిన మన ప్లేయర్ ఎవరో తెలుసా..? రోహిత్, కోహ్లీ కాదు..

పాకిస్తాన్‌లో (Pakistan) ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అథ్లెట్ గురించి వెతికారో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మానదు.

2025లో పాకిస్తాన్ వాళ్లు పిచ్చి పిచ్చిగా వెతికిన మన ప్లేయర్ ఎవరో తెలుసా..? రోహిత్, కోహ్లీ కాదు..

Pakistan Most Searched Athlete Of 2025 Is Indian

Updated On : December 9, 2025 / 10:25 AM IST

Pakistan : మ‌రికొన్ని రోజుల్లో 2025 సంవ‌త్స‌రం ముగియ‌బోతోంది. ఈ ఏడాది ఎంతో మంది యువ ఆట‌గాళ్లు క్రీడ‌ల్లో స‌త్తా చాటారు. ఇక గూగుల్‌లో ఏ అథ్లెట్ గురించి ఎక్కువ‌గా వెతికారో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి చాలా మందిలో ఉంటుంది. మ‌న దేశం సంగ‌తి కాస్త ప‌క్క‌న పెడితే.. పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అథ్లెట్ గురించి వెతికారో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మానదు.

ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. కోహ్లీ ఎన్న‌డూ పాక్‌లో ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికి కూడా అత‌డిని ఆ దేశంలో ఆరాధించే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. అయితే.. 2025లో అత్య‌ధిక పాక్ ప్ర‌జ‌లు గూగుల్‌లో వెతికింది కోహ్లీ గురించో ఆ దేశ స్టార్ ఆట‌గాళ్లు బాబ‌ర్ ఆజాం, షాహీన్ అఫ్రిది, రిజ్వాన్‌ గురించో కాదు. టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి.

Sania Mirza : ఇటు సానియా మీర్జా .. అటు ఎవరో తెలుసా?

ఈ ఏడాది పాకిస్తాన్‌లో గూగుల్‌లో అత్య‌ధికంగా వెతికిన అథ్లెట్లు జాబితా..

* అభిషేక్ శర్మ
* హసన్ నవాజ్
* ఇర్ఫాన్ ఖాన్ నియాజీ
* సాహిబ్జాదా ఫర్హాన్
* ముహమ్మద్ అబ్బాస్

హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ అబ్బాస్ వంటి యువ ఆట‌గాళ్ల కోసం ఎక్కువ‌గా సెర్చ్ చేశారు.

పాక్ పై వీర బాదుడు..

ఈ ఏడాది భార‌త్, పాక్ జ‌ట్లు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ఆసియాక‌ప్ 2025లో మొత్తం నాలుగు సార్లు త‌ల‌ప‌డ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ భార‌త్ విజ‌యం సాధించింది. ముఖ్యంగా ఆసియాక‌ప్ 2025లో పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ చెల‌రేగి ఆడాడు. ఓ మ్యాచ్‌లో 13 బంతుల్లో 31 ప‌రుగులు చేసిన అత‌డు మ‌రో మ్యాచ్‌లో 39 బంతుల్లో 74 ప‌రుగులు సాధించాడు. దీంతో అత‌డి పేరు మారుమోగిపోయింది. అత‌డి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ‌గా పాక్ ప్ర‌జ‌లు సెర్చ్ చేశారు.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టాస్ గెలిచేందుకు సూర్య‌కుమార్ యాద‌వ్ మాస్ట‌ర్ ప్లాన్‌..

ఆసియాక‌ప్ 2025లో అభిషేక్ శ‌ర్మ 44.85 స‌గ‌టు 200 స్ట్రైక్‌రేటుతో 314 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ ను సొంతం చేసుకున్నాడు.