Vaibhav Sooryavanshi : ముగిసింది ఐపీఎలే.. వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసాలు కాదు.. బుడ్డోడు త‌దుప‌రి ఆడే మ్యాచ్‌, సిరీస్ వివ‌రాలు ఇవే..

ఐపీఎల్ 2026లో వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) విధ్వంస‌క‌ర విన్యాసాలకు తెర‌ప‌డింది.

IPL 2026 complet Vaibhav Sooryavanshi next match Date, tournament details here

  • ఐపీఎల్ 2026లో ఫైన‌ల్ చేర‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌
  • ఈ సీజ‌న్‌లో ముగిసిన వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసాలు

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర విన్యాసాలకు తెర‌ప‌డింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్‌కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఇన్నాళ్లు వైభ‌వ్ విధ్వంసాల‌కు అల‌వాటు ప‌డిన ఫ్యాన్స్ అత‌డిని తొంద‌ర‌గా టీమ్ఇండియాలోకి తీసుకోవాల‌ని డిమాండ్లు చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే బీసీసీఐ ఇందుకు సంబంధించి ఓ అడుగుముందుకు వేసింది.

భార‌త్-ఏ జ‌ట్టుకు వైభ‌వ్ సూర్య‌వంశీని ఎంపిక చేసింది. భార‌త్‌-ఏ జ‌ట్టు ట్రై సిరీస్ కోసం జూన్‌లో శ్రీలంక‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో వైభ‌వ్ అద్భుతంగా ఆడితే.. అతి త్వ‌ర‌లోనే అత‌డిని టీమ్ఇండియా జాతీయ జ‌ట్టులో చూసే అవ‌కాశం ఉంది.

*Vaibhav Sooryavanshi : నేను నీకు ముందే చెప్పానుగా.. మ‌ళ్లీ అలాగే చేశావు ఏందీ.. వైభ‌వ్ సూర్య‌వంశీతో రియాన్ ప‌రాగ్.. వీడియో వైర‌ల్‌..

వ‌న్డే ట్రై సిరీస్‌లో శ్రీలంక‌-ఏ, భార‌త్‌-ఏ, అఫ్గానిస్థాన్‌-ఏ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో ఒక్కొ జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అగ్ర‌స్థానంలో నిలిచిన రెండు జ‌ట్లు ఫైన‌ల్ ఆడ‌తాయి. ఈ సిరీస్‌లో భార‌త ప్ర‌యాణం జూన్‌-9న ప్రారంభం కానుంది. ఆతిథ్య శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ట్రై సిరీస్ షెడ్యూల్ ఇదే..

* జూన్ 9న – భార‌త్ ఏ వ‌ర్సెస్ శ్రీలంక ఏ
* జూన్ 11న – భార‌త్ ఏ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్ ఏ
* జూన్ 13 న – శ్రీలంక ఏ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్ ఏ
* జూన్ 15న – భార‌త్ ఏ వ‌ర్సెస్ శ్రీలంక ఏ
* జూన్ 17న – భార‌త్ ఏ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్ ఏ
* జూన్ 19న – శ్రీలంక ఏ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్ ఏ
* జూన్ 21న – ఫైన‌ల్ మ్యాచ్‌

మ్యాచ్‌లు అన్ని దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి.

*Irfan Pathan : 15 ఏళ్ల బుడ్డోడికి బాడీ లైన్ బౌలింగా?.. నేను ఓ బిడ్డ‌కు తండ్రినే.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026లో 16 మ్యాచ్‌ల్లో 48.50 స‌గ‌టుతో 237.31 స్ట్రైక్‌రేటుతో 776 ప‌రుగులు చేశాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. అంత‌ర్జాతీయ బౌల‌ర్ల‌ను సైతం అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌డు ట్రై సిరీస్‌లోనూ ప‌రుగుల వ‌ర‌ద పారించి భార‌త జ‌ట్టు త‌లుపులు త‌ట్టాల‌ని ఆశిద్దాం.