CSK vs MI : నేడు చెన్నై వ‌ర్సెస్ ముంబై.. ధోని, రోహిత్‌లు ఆడేనా? ఒక‌రినొక‌రు క‌లుసుకుని..

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా నేడు చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ (CSK vs MI) త‌ల‌ప‌డ‌నుంది.

IPL 2026 CSK vs MI coaches give big update on dhoni and rohit sharma (pic credit@csk)

  • చెన్నై వ‌ర్సెస్ ముంబై మ్యాచ్ నేడు
  • ధోని, రోహిత్ ఆడేనా?
  • మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌లో క‌లుసుకున్న ధోని, రోహిత్‌

CSK vs MI : ఐపీఎల్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా నేడు (మే 2) చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తుండ‌గా.. ఇరు జ‌ట్లలోని దిగ్గ‌జ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోనిలు ఆడ‌తారా? లేదా అన్న‌దానిపైనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీనిపై ఇరు జ‌ట్ల హెడ్ లు స్ప‌ష్ట‌త ఇచ్చారు.

హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ గాయం నుంచి కోలుకున్న‌ట్లు ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేలా జ‌య‌వ‌ర్థ‌నే తెలిపాడు. అయిన‌ప్ప‌టికి కూడా అత‌డిని మెడిక‌ల్ టీమ్ రోజు ప‌ర్య‌వేక్షిస్తోంద‌న్నాడు. మ్యాచ్ స‌మ‌యానికి అత‌డు ఎలా ఉంటాడు అన్న‌ది గ‌మ‌నించి అప్పుడే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు. మెడిక‌ల్ టీమ్ ఓకే చెబితేనే ఆడిస్తామ‌ని, తాము అత‌డి విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌మ‌ని చెప్పాడు.

Kyle Jamieson : ఇప్పుడు చూసితివా జేమీస‌న్‌.. బుడ్డోడిపైనా నీ ప్ర‌తాపం .. చ‌ర్య‌లు తీసుకున్న బీసీసీఐ

ప్ర‌స్తుతానికి ఎంఎస్ ధోని బాగున్నాడ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. అత‌డు త‌ప్ప‌కుండా మ్యాచ్‌లు ఆడ‌తార‌ని, అయితే.. ముంబైతో నేడు జ‌రిగే మ్యాచ్‌లో ఆడ‌తాడా? లేదా? అనే విష‌యాన్ని తాను ఇప్పుడే చెప్ప‌లేన‌ని అన్నాడు. అత‌డి బ్యాటింగ్‌, కీపింగ్ నైపుణ్యాల గురించి ఎలాంటి అనుమానం లేద‌న్నాడు.

కాగా.. 44 ఏళ్ల ధోని సీఎస్‌కే ఆడే మ్యాచ్‌ల‌కు ముందు ప్రాక్టీస్ చేస్తూ క‌నిపిస్తున్నాడు. అయితే.. ఆడ‌డం లేదు అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి గాయం తిర‌గ‌బెట్ట‌డ‌మే అందుకు కార‌ణం.

IPL 2026 RR vs DC : ఆ తప్పు మా కొంపముంచింది.. మా అసలు వ్యూహం ఇదే.. ఓటమిపై రియాన్ పరాగ్ కీలక కామెంట్స్..

ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం ప్రాక్టీస్ సంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ‌, ధోని లు క‌లుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీరితో పాటు సూర్య కూడా చ‌ర్చ‌ల్లో పాలుపంచుకున్నాడు.